ఒక సంక్షోభం మరొకరికి గొప్ప అవకాశం కావచ్చు. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా ఇలాంటి అవకాశాన్ని అందుకున్నాయి. చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా అందరూ ఓటీటీల వైపే చూస్తున్నారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీలకు సినిమాలు, వెబ్ సిరిస్ లు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే 'అమృత రామమ్'' అనే సినిమా నేరుగా ఓటీటీలో విడుదల అయ్యింది. 'కృష్ణ లీల'' అనే మరో సినిమా కూడా విడుదల రెడీ అవుతుంది.
ఈ వరుసలో మరో సినిమా కూడా ఒటీటీ పై సత్తా చాటడానికి రెడీ అయ్యింది. అదే 'ది ట్రిప్'. జగపతి బాబుతో 'రక్షా', సునీల్ తో 'జక్కన్న' లాంటి సినిమాలు అందించిన వంశీ కృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రానికి దర్శకుడు. గౌతమ్ అనే యువ హీరో ఈ చిత్రంతో పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. సినియర్ హీరోయిన్ ఆమని, విలక్షణ నటుడు షఫీ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. కార్తిక్ మ్యూజిక్. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకొన్న ఈ సినిమా విడుదలపై ఓ ప్రముఖ ఒటీటీ సంస్థతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. అతి త్వరలో ఈ సినిమా విడుదలపై ఓ అధికారిక సమాచారం రానుంది. ఒక వైవిధ్యమైన కధనంతో తెరకెక్కిన ఈ చిత్రం ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుందని యూనిట్ ధీమాగా వుంది.