హెడ్డింగ్ చూసి కంగారుపడకండి. ఇది మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కాదు, మన పొరుగున ఉన్న తమిళనాడులో.
తెలియవస్తున్న వివరాల ప్రకారం, GST బిల్లు అమలులోకి వచ్చిన నేపధ్యంలో తమిళనాట చిత్ర పరిశ్రమ పై పన్ను పెద్ద ఎత్తున పెరగనుండడంతో తమిళనాడులోని ధియేటర్ల యాజమాన్యం సోమవారం నుండి బంద్ కి పిలుపునిచ్చాయి.
అయితే GST పన్నుతో పాటుగా, కార్పోరేషన్, మున్సిపాలిటీ పన్నులు కూడా తమిళనాట సినిమా టికెట్ల పై ప్రభావం చూపనుంది. దీనితో టికెట్ రెట్లు భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో థియేటర్ల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
దీనితో తమిళ చలనచిత్ర పరిశ్రమ పై తీవ్ర ప్రభావం పడనుంది.