వరుణ్ తేజ్-రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం తొలిప్రేమ. ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రానికి కలెక్షన్స్ హవా నడుస్తున్నది.
ఇదే సమయంలో ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నది. ఇందుకు ఉదాహరణ ఈ చిత్రానికి అమెరికాలో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించడమే. వరుణ్ గత చిత్రం ఫిదా కూడా ఇదే రీతిలో కలెక్షన్స్ వసూలు చేసింది.
దీనితో వరుసగా రెండు చిత్రాలు అమెరికాలో 1 మిలియన్ డాలర్లు వసూలు చేయడంతో ఈయనకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఏర్పడిపోయింది. మెగా హీరోలలో కూడా ఓవర్సీస్ లో ఇంతటి మంచి రికార్డు ఉన్న మరో మెగా హీరో లేదు అంటే నమ్మశక్యం కాదు.