విశాల్‌కి చుక్క‌లు చూపిస్తున్న ద‌ర్శ‌కుడు

మరిన్ని వార్తలు

విశాల్ - మిస్కిన్ మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి ఇది వ‌ర‌కు డిటెక్టీవ్ అనే సినిమా తీశారు. అది మంచి హిట్ట‌య్యింది. దానికి సీక్వెల్ గా డిటెక్టీవ్ 2ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే అటు విశాల్‌కీ, ఇటు మిస్కిన్‌కీ మ‌నస్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.40కోట్లుగా అనుకున్నారు. అయితే స‌గం సినిమా పూర్త‌వ్వ‌కుండానే మిస్కిన్ ఆ న‌ల‌భై కోట్లూ అవ్వ‌గొట్టేశాడు. దాంతో మిస్కిన్‌ని తొల‌గించి, తానే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకున్నాడు విశాల్‌. ఈ టీమ్ నుంచి మిస్కిన్ ఎప్పుడైతే బ‌య‌ట‌కు వెళ్లిపోయాడో.. అప్ప‌టి నుంచీ విశాల్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు మిస్కిన్‌.

 

ఈ సినిమాని ఎలాగైనా అడ్డుకోవాల‌న్న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాడు. త‌న పారితోషికంగా రూ.5 కోట్లు చెల్లించాల‌ని, హిందీ రీమేక్ రైట్స్ త‌న‌కు చెప్ప‌కుండా అమ్మ‌కూడ‌ద‌ని, ఈ సినిమాకి సీక్వెల్‌, ప్రీక్వెల్ త‌న అనుమ‌తి లేకుండా తీయ‌కూడ‌ద‌ని ష‌ర‌తులు విధించాడు మిస్కిన్‌. ప్ర‌స్తుతం ఈ గొడ‌వ త‌మిళ‌నాడు ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో ఉంది. అది తేలితే గానీ, డిటెక్టీవ్ 2 షూటింగ్ ముందుకు వెళ్లే అవ‌కాశం లేదు. మిస్కిన్‌తో రాజీ కుదిర్చేందుకు కొంత‌మంది మ‌ధ్య‌వ‌ర్తులు ప్ర‌య‌త్నించినా, లాభం లేకుండా పోయింది. మ‌రి.. ఈ గొడ‌వ ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లి ఆగుతుందో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS