బన్నీ ` సుకుమార్ కాంబినేషన్ మూవీకి సంబంధించి ఓ తాజా అప్డేట్ తెరపైకి వచ్చింది. రేపో మాపో సెట్స్‌లో అడుగుపెట్టాల్సిన బన్నీ, షూటింగ్ వాయిదా వేయమని యూనిట్‌కి సూచించాడన్న వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగానే బన్నీ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేరళలో బన్నీ లేకుండానే ఇప్పటికే కొంత పార్ట్ షూటింగ్ జరిగిందన్న ప్రచారం ఉంది. అయితే, అదంతా ఉత్తదే అంటున్నారు. సుకుమార్ జస్ట్ ట్రయల్స్ వేశాడని మాట్లాడుకుంటున్నారు. అయితే, అదేం లేదనీ, ఈ సినిమాని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశ్యంతో బన్నీ లేకుండా మిగిలిన పాత్ర ధారులపై కొన్ని కీలక సన్నివేశాల్ని సుకుమార్ తెరకెక్కించడం నిజమే అని అంటున్నారు.
ఇక ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వస్తే వచ్చింది కానీ, నెలాఖరుకల్లా రెగ్యులర్ షూటింగ్ ప్లాన్‌లో సుకుమార్ ఉన్నాడనీ తెలుస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఎక్కువ భాగం అటవీ ప్రాంతంలోనే షూట్ చేయాల్సి వస్తుంది. అందుకు అవసరమైన లొకేషన్స్‌ని ఎప్పుడో సెర్చ్ చేసి, రెడీగా ఉంచాడు సుకుమార్. ఇక బన్నీ ఎంటర్ అయితే, ఫాస్ట్ ఫాస్ట్‌గా షెడ్యూల్స్ కంప్లీట్ చేసేయడమేనట. మైత్రీ మూవీస్ బ్యానర్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ చిత్తూరు కుర్రోడిలా మాస్ లుక్స్‌లో కనిపించనున్నాడు. రష్మికా మండన్నా హీరోయిన్గా నటించనుంది. విజయ్ సేతుపతి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.