టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ రివ్యూ

మరిన్ని వార్తలు

టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితానికి మాస్ మహారాజా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ జోడించి ఈ కథని చూపిస్తున్నారనిపించింది. ట్రైలర్ లో నాగేశ్వరరావు క్యారెక్టర్ ని ఎస్టాబ్లెస్ చేశారు. నాగేశ్వరరావు కి దొంగతనం చేసేముందు చెప్పడం అలవాటు.. అలాగే రన్నింగ్ ట్రైన్ పైకి ఎక్కే అలవాటు వుందని కథలుగా చెబుతుంటారు. ట్రైలర్ లో అలాంటి ఎలిమెంట్స్ కనిపించాయి. 


రవితేజ వైల్డ్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ ఎలిమెంట్స్ బాగానే వున్నాయి. ఐతే కొన్ని సిజీ షాట్లు ఈజీగా తెలిసిపోతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సౌండ్ బావుంది.  


ట్రైలర్ లో మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే..  టైగర్ నాగేశ్వరరావు అంటే రాబిన్ వుడ్ ఇమేజ్ వుంది. కానీ ఇందులో మాత్రం అతనిలో చాలా కోణాలు చూపిస్తున్నారు. నాగేశ్వర రావు అమ్మాయిల చుట్టుకొలతల గురించి మాట్లాడిట్లు  ఓ డైలాగ్ కూడా పెట్టారు. ఈ సినిమా కోసం దర్శకుడు రెండేళ్ళు రీసెర్చ్ చేశాడట. ట్రైలర్ చూస్తుంటే టైగర్ గురించి బయటికి తెలియని కొన్ని విషయాలు ఇందులో చూపించబోతున్నారనే అనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS