దిశా! ఏంటీ 'టైగర్‌'తో గుసగుస..?

మరిన్ని వార్తలు

అందాల భామ దిశా పటానీ, బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అదే 'బాఘీ - 2'. గతంలో టైగర్‌ ష్రాఫ్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా తెరకెక్కిన 'బాఘీ' చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ శ్రీలంకలో జరుగుతోంది. ఇదంతా సినిమా సంగతి. 

అయితే గత కొంత కాలంగా టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ మధ్య ఎఫైర్‌ నడుస్తుందనీ బాలీవుడ్‌ కోడై కూస్తోంది. అయితే ఈ రూమర్స్‌ ఈ ఇద్దరికీ కొత్తేమీ కాదు. గతంలోనే వీటిని ఈ జంట ఖండించింది కూడా. కానీ లేటెస్టుగా కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలు చూసి, ఈ జంట మళ్లీ గాసిప్స్‌కి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆ ఫోటోల్లో టైగర్‌ ష్రాఫ్‌ 6 ప్యాక్‌ బాడీ కాదు. 8 ప్యాక్‌ బాడీతో వెరీ వెరీ రొమాంటిక్‌గా కనిపిస్తున్నాడు. ముద్దుగుమ్మ దిశా పటానీ టూ పీస్‌ బికినీలో టూ హాట్‌గా కనిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఉన్నట్లుగా ఫోటోలు లేకపోయినప్పటికీ, సెపరేట్‌గా ఉన్న ఈ ఇద్దరి సోలో ఫోటోల వెనకా ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌ సేమ్‌ ఉంది. బీచ్‌ కాదు కానీ, సముద్రం ఒడ్డు, దాని వెనకాలే ఉన్న కొండలు, చెట్లూ ఇలా సేమ్‌ టు సేమ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో దిగిన ఫోటోలివి. 

దాంతో ఈ ఇద్దరూ కలిసే ఈ ప్లేస్‌కి వెళ్లారా అని బాలీవుడ్‌ వర్గాల అనుమానం. హాలీడే వెకేషన్‌ని ఈ జంట ఎంజాయ్‌ చేస్తున్నారంటూ, ఈ కపుల్‌ మధ్య మళ్లీ గాసిప్స్‌ జోరందుకున్నాయి. ఏమో ఈ గాసిప్స్‌తో ఈ ఇద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. తెలుగులో 'లోఫర్‌' సినిమాలో నటించింది బ్యూటీ దిశా పటానీ. అలాగే ప్రస్తుతం తమిళంలో 'సంఘమిత్ర' సినిమాలో నటిస్తోంది. సుందర్‌. సి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది 'సంఘమిత్ర'.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS