బాలీవుడ్ సీనియర్ హీరోలు ప్రయోగాల్లో ముందుంటారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తమ తమ కొత్త ప్రయోగాలతో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ వంతు వచ్చింది. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమా టైటిల్‌ని న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. సినిమా టైటిల్ 'జీరో'. ఈ సినిమాలో షారూఖ్ మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమా టైటిల్‌తో పాటు, షారూఖ్ ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. నాలుగు అడుగులున్న బాలుడిలా కనిపిస్తున్నాడు షారూఖ్ ఖాన్. తెలుగులో కమల్ హాసన్ ఇలా మరుగుజ్జు పాత్రలో నటించాడు. 'విచిత్ర సోదరులు' అనే చిత్రం కోసం కమల్ హాసన్ మరుగుజ్జుగా నటించారు. అప్పట్లో ఆ సినిమా ఘనవిజయం సాధించింది. అలాగే బాలీవుడ్‌లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ 'పా' సినిమాలో ఈ తరహా పాత్రలో కనిపించారు. వయసుతో సంబంధం లేకుండా అలాంటి పాత్రలో నటించినందుకు అమితాబ్ బచ్చన్‌ని ప్రశంసలతో ముంచెత్తేశారు అప్పట్లో. 'పీకె' సినిమా కోసం అమీర్‌ఖాన్ గ్రహాంతరవాసిగా విచిత్రమైన గెటప్‌లో కనిపించాడు. ఫిజిక్ పరంగా చాలా ఛేంజెస్ కనిపిస్తాయి ఆ పాత్రకి. పెద్ద చెవులు, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో అమీర్ ఖాన్ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'జీరో' అనే టైటిలే చాలా కొత్తగా ఉంది.
ఇక షారూఖ్ పాత్ర తాలూకు గెటప్ ఇంకా కొత్తగా ఉంది. ప్రోస్తటిక్‌తో తయారు చేసిన చేతులు, కాళ్లతో షారూఖ్ గెటప్ ఆశక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్, అనుష్కా హీరోయిన్లుగా నటిస్తున్నాడు. ఇటీవల షారూఖ్, అనుష్కా కాంబినేషన్‌లో వచ్చిన్ 'జబ్ హ్యారీ మెట్ సెజల్' చిత్రం కొంచెం నిరాశ పరిచింది. అయితే 'జీరో' సినిమా ఫస్ట్‌లుక్‌తోనే అంచనాలు పెంచేశాడు షారూఖ్. ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు అతిధి పాత్రల్లో కనిపించనున్నారట.