ప్చ్.. హిట్లు కోసం హీరోల పాట్లు !

By Inkmantra - November 26, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

సినీ పరిశ్రమలో టాలెంట్ కంటే.. సక్సెస్ కే స్టార్ డమ్ ఎక్కువ. హిట్ ఉంటే కమెడియన్ కూడా హీరో అయిపోతాడు, అదే హిట్ లేకపోతే హీరో కూడా కమెడియన్ గా మారిపోతాడు. ఏమైనా హిట్ ఉంటేనే వాల్యూ. అందుకే ప్రతి ఒక్క హీరో హిట్ ఊహల్లోనే ఉగిపోతుంటాడు. కానీ చాలా కాలం నుంచి హిట్ కోసం ఫైట్ చేస్తూ, హిట్ కొట్టలేక బాక్సాఫీస్ వద్ద పడిగాపులు కాస్తోన్న హీరోలు మన టాలీవుడ్ లో ప్రొడక్షన్ హౌస్ కి ఒక్కళ్ళు కనిపిస్తారు. నాగార్జున, రవితేజ దగ్గరనుంచీ గోపీచంద్, నితిన్, అఖిల్ మీదుగా నారా రోహిత్, సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ దాకా.. ఇలా చెప్పుకుంటూ పోతే నలుగురు ఐదుగురు హీరోలు తప్ప అందరూ ఈ లిస్ట్ లోని సభ్యులే.

 

ఒక్కప్పుడు తోటి హీరోలు అసూయ పడేలా వరుసగా హిట్స్ మీద హిట్స్ కొట్టిన అల్లరోడు.. ప్రస్తుతం హిట్ లేక ప్లాప్ ల వలయంలో మునిగితేలుతున్నాడు. అలాగే అప్పట్లో 'ప్లాప్ హీరో'కి పర్యాయ పదంగా మారిపోయిన నితిన్.. ఎట్టకేలకూ మళ్లీ మినిమమ్ గ్యారింటీ హీరోగా చలామణి అవుతున్న టైంలో.. ‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’లాంటి భారీ డిజాస్టర్లతో మళ్లీ డీలా పడ్డాడు. ఇక యాక్షన్ హీరో గోపీచంద్‌ కి అయితే ఈ మధ్య ప్లాప్ లు తప్ప హిట్లు అస్సలు రాను అంటున్నాయి. మూడు సినిమాలు చేసినా అక్కినేని అఖిల్ ఖాతాలో ఇంకా ఏవరేజ్ హిట్ కూడా లేకపాయే. రవితేజ గురించి చెప్పుకుంటే మధ్యలో 'రాజా ది గ్రేట్' తప్ప ఆ సినిమాకి ముందు చేసిన బెంగాల్ టైగర్, కిక్ 2, ఆ సినిమా తరువాత చేసిన 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్టు', 'అమర్ అక్బర్ ఆంటోని' ఇలా అన్ని బెస్ట్ ప్లాప్ లే.

 

నాగార్జున చేసిన చివరి నాలుగు సినిమాలు అత్యున్నతమైన డిజాస్టర్లు. బాలయ్య బాబు కూడా 'కథానాయకుడు, మహానాయకుడు'లతో పూర్తిగా మునిగిపోయాడు. ఎప్పటినుంచో సరైన హిట్ కోసం హీట్ ఎక్కేలా ఫైట్ చేస్తోన్న సాయి ధరమ్ తేజ్ కూడా ‘చిత్రల‌హరి’తో సాలిడ్ హిట్ రాబట్టలేకపోయాడు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్, మహేష్, ఎఫ్ 2తో వెంకటేష్ లాంటి కొంతమంది హీరోలు తప్ప మిగిలిన వాళ్ళంతా హిట్లు కోసం పాట్లు పడుతున్న వారే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS