`నీకు నాకు డాష్ డాష్`, `బస్ స్టాప్` లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు ప్రిన్స్. బిగ్ బాస్ 1లోనూ పాల్గొన్నాడు. ,నేను శైలజలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయాడు. సోమవారం రాత్రి కూకట్ పల్లిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికాడు ప్రిన్స్. తప్పతాగి కారు నడుపుతున్న ప్రిన్స్‌ని గుర్తించిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు.
పరిమితికి మించి మద్యం సేవించడంతో పోలీసులు ప్రిన్స్ కారుని సీజ్ చేసి ప్రిన్స్‌పై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం కూకట్ పల్లి కోర్టుకి ప్రిన్స్ హాజరయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సినీ తారలు పోలీసులకు దొరికిపోవడం, కోర్టు కు వెళ్లడం ఇదేం కొత్త కాదు. ఇది వరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కానీ.. ఎవ్వరూ మారడం లేదు.