కన్నడ నటుడు రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ‘కాంతార’ ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే. తెలుగు ప్రేక్షకులనూ ఈ చిత్రం మంత్రముగ్దుల్ని చేస్తోంది. గీత ఆర్ట్స్ విడుదల చేసిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విజయం దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా రిషబ్‌శెట్టి పేరు టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది.
ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మంది రిషబ్‌శెట్టితో సినిమాలు చేయలని ఆసక్తి చూపుతున్నారు. గీత ఆర్ట్స్ ఇప్పటికే రిషబ్ తో ఒక సినిమా చేస్తున్నట్లు చెప్పింది. అయితే టాలీవుడ్ లో కొందరు హీరోలు రిషబ్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘కాంతార’ పాన్ ఇండియాని ఆకట్టుకుంది. ఇలాంటి కథలు ఏమైనా వుంటే చేద్దామని రిషబ్ కు తో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే గీత ఆర్ట్స్ మాత్రం రిషబ్ తో చేసే సినిమా డైరెక్షన్ కాకుండా హీరోగానే చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.