ఓ వైపు నుసి, ఇంకోవైపు పొగ.. ఈ నగరానికి ఏమైంది.? సినిమా ధియేటర్స్‌లో ప్రదర్శించబడే సినిమా ఏదైనా, ముందుగా ఈ డైలాగ్‌తో కమర్షియల్ యాడ్ రావాల్సిందే. అలా ఈ డైలాగ్ చాలా పాపులర్ అయిపోయింది. ఎన్నో స్ఫూఫ్‌లు చేసేశారు ఈ డైలాగ్‌తో. అంతేకాదు ఇదే డైలాగ్‌తో సినిమా కూడా రూపొందించేశారు. అయితే, తాజాగా అందాల భామలకేమైంది. దమ్ము కొట్టేస్తున్నారు. బీరు తాగేస్తున్నారు.
పుట్టినప్పుడు బట్టలతో పుట్టలేదు కదా.. ఇప్పుడెందుకు బట్టలేసుకోవాలి.. బట్టలిప్పేస్తే బావుంటుంది కదా.. అంటూ అసభ్యంగా డైలాగుల మీద డైలాగులు కొట్టేస్తున్నారు. ఈ డైలాగులతో వెండితెరపై వీరి చేష్టలతో అసభ్యంగా, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. పైన చెప్పిన డైలాగులకు సంబంధించిన సీన్లలో నటించిన ప్రబుద్ధ ముద్దుగుమ్మలు మరెవరో కాదు.. పాపులర్ భామలే. దమ్ము కొట్టిన భామ రకుల్ ప్రీత్‌సింగ్. 'మన్మధుడు 2' సినిమా కోసం కిక్కెక్కేలా దమ్ము కొట్టేసింది. బీరు కొట్టిన పాపేమో శ్రద్ధాకపూర్.. బాలీవుడ్ పాపులర్ హీరోయిన్. 'సాహో'లో 'సైకో సయ్యా..' అంటూ బీరు కొట్టి చిందేసింది.
ఇక ముచ్చటగా మూడో భామ అమలాపాల్. 'ఆమె' సినిమా కోసం బట్టలిప్పేస్తే బావుండంటోంది. అన్నట్లు కొత్త భామ నభా నటేష్‌తో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో డేరింగ్ డైరెక్టర్ చెప్పించిన డైలాగ్ విన్నారు కదా. వరంగల్ పోరగాళ్లను డాష్ పోయిస్తానంటోంది.. ఇదీ అందాల భామల పరిస్థితి. ఇంకో పక్క మహిళల హక్కులూ, భద్రతా.. కాస్టింగ్ కౌచ్.. ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా అంటూ లెక్చర్లు ఇచ్చేస్తున్నారు. సినిమా పేరు చెప్పి, వీరు చేస్తున్న చేష్టలేమో ఇలా బరి తెగించిపోతున్నాయి. అసలీ భామలకేమైంది.? తెలుగు సినిమాలో ఈ అసభ్య సంస్కృతి ఇంకెంత దూరం పోతుంది.? అని నెటిజన్లు వాపోతున్నారు.