బాలీవుడ్‌ నిర్మాతను మెప్పించిన తెలంగాణ పోరీ!

మరిన్ని వార్తలు

పదహారణాల తెలుగమ్మాయ్‌. మంచి టాలెంటెడ్‌. అయితే ఏం లాభం. తెలుగమ్మాయిలుకు తెలుగులో అవకాశాలు అంతంత మాత్రమే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, మన తెలుగమ్మాయిల టాలెంట్‌ని పొరుగు వారు బాగా గుర్తిస్తుంటారు. అందుకే తెలుగమ్మాయిలు తెలుగులో కన్నా, తమిళ తదితర భాషల్లో ఎక్కువగా స్టార్‌ హోదా సంపాదిస్తున్నారు. అలాగే మన ఈషా రెబ్బ కూడా నార్త్‌లో స్టార్‌గా ఎదిగే అవకాశాలున్నాయేమో. ఎందుకంటారా.? ఇంతవరకూ తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే నటించిన ఈషా రెబ్బ త్వరలో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోంది.

 

సోనమ్‌ కపూర్‌ సోదరుడు హర్షవర్దన్‌ పూర్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో ఈషా రెబ్బ హీరోయిన్‌గా ఎంపికైందంటూ తాజా సమాచారం. హీరోయిన్‌ పాత్ర ప్రధానంగా సాగే ఈ సినిమాలో ఈషా ఛాన్స్‌ కొట్టేయడం, జాతీయ అవార్డు గ్రహీత రాజ్‌సింగ్‌ చౌదరి ఈ సినిమాకి దర్శకుడు కావడం.. ఈషా రెబ్బ జాక్‌పాట్‌ కొట్టిందనే అనిపిస్తోంది. తెలుగు సినిమాల్లో ఈషా నటనకు ఇంప్రెస్‌ అయిన ఓ బాలీవుడ్‌ నిర్మాత, ఈషాకి ఈ ఛాన్స్‌ ఇచ్చారని బాలీవుడ్‌ సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుందట. సో నిజంగానే మన తెలుగమ్మాయ్‌ నార్త్‌లో సందడి చేయనుందా.? అంటే, అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS