దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. ఈ నానుడి అందాల భామలకు బాగా వర్తిస్తుంది. అయితే, అందరూ ఈ బోనస్‌ని సద్వినియోగం చేసుకుంటారా? అంటే, కన్నడ బ్యూటీ రష్మికా మండన్నాలాంటి వాళ్లు సద్వినియోగం చేసుకోవాలనే అనుకుంటారు. అసలు విషయం ఏంటంటే, ఈ మధ్య రష్మికా వరుసగా క్రేజీ ఆఫర్స్ కోల్పోతోందట అనే విమర్శ బాగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అందుకు కారణమేంటంటే, రెమ్యునరేషన్ అట. ఈ విషయంలో రష్మికా మండన్నాపై చాలా కాలం నుండీ రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే, అవి జస్ట్ రూమర్స్ మాత్రమే అని కొట్టి పారేయడానికి లేదు. 'తప్పేముంది.? క్రేజ్ ఉన్నప్పుడు రెమ్యునరేషన్ పెంచడంలో తప్పే లేదు..' అని గతంలో రష్మికా ఓ సందర్భంలో చెప్పింది కూడా. అయితే, చెప్పడం వరకూ బాగానే ఉంది. రేటు పెంచడమూ బాగానే ఉంది. కానీ, ఆ పెరిగిన రేటు కారణంగా అవకాశాలు కోల్పోతే.? ఈ మధ్య రష్మిక అలాగే చాలా అవకాశాలు కోల్పోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో విజయ్ సినిమాకి హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే, రెమ్యునరేషన్ విషయంలోనే చర్చల దశలో ఆగిపోయిందట.
అలాగే బాలీవుడ్ ఛాన్స్ కూడా పోగొట్టుకుందని తెలుస్తోంది. 'జెర్సీ' హిందీ రీమేక్ కోసం హీరోయిన్‌గా రష్మికనే అనుకున్నారట. బాలీవుడ్ ఎంట్రీ మూవీకే రష్మిక భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో, ఈ అవకాశం కూడా చేజారిపోయిందని తెలుస్తోంది. ఇంతవరకూ రష్మిక కెరీర్‌లో బెస్ట్ హిట్ అంటే, 'గీత గోవిందం' మాత్రమే. ఒక్క హిట్‌కే ఇలా చేస్తే, ఫ్యూచర్ ఎలా బిల్డప్ చేసుకుంటుంది రష్మిక.. అంటూ ఆమె అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక, 'సరిలేరు నీకెవ్వరు..' సినిమాలోనూ, 'భీష్మ' తదితర చిత్రాల్లో నటిస్తోంది.