రాహుల్ తమ గ్రూప్‌లోంచి విడిపోయాడనీ, అంతవరకూ తనతో మెయింటైన్ చేసిన అన్నా చెల్లెలి రిలేషన్ షిప్ ఫేక్ రిలేషన్ షిప్ అని బయటికి వెళ్లిన వితిక చెప్పింది. అయితే, పునర్నవి బయటికి వెళ్లాక, రాహుల్ ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చిన సంగతి నిజమే. అయినా, వితికను మాత్రం రాహుల్ చెల్లెలిగానే భావించాడు. వితిక నోటి వెంట వచ్చిన ఆ మాటకు రాహుల్ చాలా బాధపడ్డాడు. ఇదిలా ఉంటే, హౌస్‌లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది శివజ్యోతి.
ఉన్న ఆరుగురిలోంచీ గ్రూపులు విడగొట్టింది. రాహుల్‌నీ, అలీ రెజానీ తన గ్రూప్‌లోకి లాగేసింది. అంతేకాదు, ఇలా అయితే, అలా జరగొచ్చు. అలా అయితే ఇలా జరగొచ్చు.. అంటూ ఈక్వేషన్స్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఫైనల్‌లో బిగ్‌బాస్ ఈక్వేషన్స్ ఎలాగైనా మారిపోవచ్చు. హౌస్‌లో ఉన్న వారి కోసం బయటి కూడా క్రేజీ గ్రూపులు ఫామ్ అవుతున్నాయి. బయటికి వెళ్లి వచ్చాక ఆలీ ఓ స్టాండర్డ్ గ్రూప్‌ని సిద్ధం చేసుకున్నాడు. ఆ విషయం ఈ వారం ఎలిమినేషన్స్ ద్వారా అర్ధమైంది. ఈ క్రేజీ గ్రూప్ అలీని విజేతగా నిలబెట్టేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తోందట. అలాగే రాహుల్‌కి మొదట్నుంచీ ఫాలోయింగ్ ఉంది.
ఆ ఫాలోయింగ్ ఇప్పుడు మరింత యాక్టివ్ అయ్యింది. రాహుల్‌ని విజేతని చేయాలని ఆ గ్రూపులు వర్క్ చేస్తున్నాయి. ఇక శ్రీముఖి ఆర్మీ పేరిట, శ్రీముఖికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో. శ్రీముఖి బిగ్‌బాస్ విన్నర్ అంటూ కొత్త కొత్త పోస్టర్స్ డిజైన్ చేసి మరీ హల్‌చల్ చేస్తోంది ఈ ఆర్మీ. ఇలా ఫైనల్ పోరుకు హౌస్ నుండీ, బయట నుండీ కూడా గ్రూపులు తమ తమ స్టైల్ ప్రదర్శిస్తున్నాయి. ప్లానింగ్స్, కన్నింగ్స్, డిఫరెంట్ ఈక్వేషన్స్.. ఇలా తుది పోరును జయించేందుకు జరుగుతున్న కసరత్తుల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.!