దూసుకుపోతున్న 'టీఆర్ఎస్‌' కు సినీ ప్రముఖుల ప్రశంసలు..!

By iQlikMovies - December 11, 2018 - 14:41 PM IST

మరిన్ని వార్తలు

తెలంగాణ‌లో  గులాబీ జెండా మ‌రోసారి రెప‌రెప‌లాడింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో... టీఆర్ఎస్‌.. త‌న హావాని చూపించి అద్బుత‌మైన విజ‌యాన్ని అందుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ తెరాస 86 స్థానాల్లో ఆధిక్యం క‌న‌బ‌రుస్తుంటే, మ‌హా కూట‌మి 22 స్థానాల‌కు స‌రిపెట్టుకుంది. అయితే ఈలోగానే టీఆర్ఎస్ గెలుపు సంబ‌రాలు మొద‌లైపోయాయి. ఈ విజ‌యాన్ని కొనియాడుతూ న‌లువైపుల నుంచీ.. కేసీఆర్ టీమ్‌కి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. సినీ సెల‌బ్రెటీలూ  స్పందించ‌డం మొద‌లెట్టారు.

``కంగ్రాట్స్ బ్ర‌ద‌ర్‌ కేటీఆర్‌... ఇదో అద్భుత‌మైన విజ‌యం`` అంటూ నేచుర‌ల్ స్టార్ నాని ట్వీట్ చేశాడు. అంతేకాదు... తెలంగాణ ప్ర‌జ‌లు త‌మ ప‌ని తాము చేశార‌ని, ఇప్పుడు టీఆర్ఎస్ వంతు వ‌చ్చింద‌ని, ఈసారి కూడా అత్యుత్త‌మ సేవ‌లు అందివ్వాల‌ని ట్వీట్ ద్వారా కోరాడు నాని.

మ‌రోవైపు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్‌లో ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. గన్ను గురి పెట్టిన కేటీ ఆర్ ప్రొఫైల్ పిక్‌ని పంచుకుంటూ... ``న‌మ్మ‌కానికి ఇది మ‌రో నిర్వ‌చ‌నం. ఫ‌లితాల‌కు ముందే.. ప్రొఫైల్ పిక్‌ని మార్చారు..`` అంటూ.. కేటీఆర్‌ని కొనియాడాడు హ‌రీష్‌. ``11 నుంచి 11.30 మ‌ధ్య‌లో ఫ‌లితాలు స్ప‌ష్ట‌మ‌వుతాయ‌ని అన్నారు. కానీ.. మ‌రింత త్వ‌ర‌గా రిల‌జ్ట్ వ‌చ్చేసింది. ఇదే ప్ర‌జాస్వామ్యం అంటే...`` అంటూ ట్వీట్ చేశారాయ‌న‌.

సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా కేసీఆర్‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు. కేసీఆర్ ఎన్నో అభివృద్ధి ప‌ధ‌కాలు ప్ర‌వేశ పెట్టార‌ని, అవే ఆయ‌న్నిగెలిపించాయ‌ని కృష్ణ పేర్కొన్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS