కాంగ్రెస్ పార్టీ తరపున మహా కూటమికి సపోర్ట్ చేసినవాళ్లతో బండ్ల గణేష్ ఒకడు. కాంగ్రెస్ పార్టీ బండ్ల గణేష్‌ని అధికారిక స్పీకర్ గా ప్రకటించడంతో.... ఎన్నికల హంగామా ఉన్నన్ని రోజులూ.. బండ్ల ఏదో ఓ టీవీ ఛానల్‌లో కనిపిస్తూ ఉండేవాడు. టీఆర్ ఎస్ ఇస్తున్న హామీల్ని తనదైన శైలిలో సెటైరికల్‌గా దుమ్మెత్తిపోసేవాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బల్ల గుద్ది చెప్పినవాళ్లలో బండ్ల మొదటి స్థానంలో ఉంటాడు.
కాంగ్రెస్ గెలుపుపై బండ్లకు ఎంత నమ్మకమంటే.... `ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. లేదంటే.. ఫలితాల రోజున 7 ఓ క్లాక్ బ్లేడుతో నా గొంతు కోసుకుంటా` అని శపథం చేశాడు. ఆ వీడియో అప్పుడే వైరల్ అయిపోయింది. ఫలితాల రోజున.. బండ్ల గణేష్‌కి బ్లేడులు దొరక్కుండా చూడండి.. అంటూ... కామెంట్లు చేశారు టీ.ఆర్.ఎస్ ఫ్యాన్స్. ఇప్పుడు ఫలితాలొచ్చాయి. కాంగ్రెస్‌పార్టీకి దిమ్మ తిరిగిపోయే రిజల్ట్ ఇది. మరి బండ్ల గణేష్ మాటేంటి? 7 ఓ క్లాక్ స్టేట్‌మెంట్ బండ్లకు గుర్తుందా, లేదా? అంటూ... ఇప్పుడు సోషల్ మీడియాలో బండ్లని ఓ రేంజులో ఆడుకుంటున్నారు జనాలు.
ఎన్నికల సమయంలో ఉత్తుత్తి వాగ్దానాలు, భీకరమైన స్టేట్‌మెంట్లు ఇవ్వడం సహజం. ఓడిపోతే ముక్కుని నేలకు రాసుకుంటా లాంటి స్టేట్‌మెంట్లు మామూలే. కానీ ఇలా గొంతు కోసుకుంటా.. ప్రాణం తీసుకుంటా, నాలిక తెగ్గోసుకుంటా లాంటి స్టేట్‌మెంట్లు మరీ ఓవర్‌గా ఉంటాయి. బండ్లన్న రాజకీయాలకు మరీ కొత్త. అలాంటప్పుడు ఇలా టంగ్ స్లిప్పయిపోయి దొరక్కుండా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రిజల్ట్ తరవాత బండ్ల గణేష్ పరిస్థితి ఏమిటో? ఇది వరకటిలా డిబేట్లకు వస్తాడా? లేదంటే పూర్తిగా సైడ్ అయిపోతాడా? వెయిట్ అండ్ సీ.