షార్ట్ ఫిలిం డైరెక్టర్‌గా పాపులర్ అయిన ఓ యువకున్ని మెగా ఫోన్ పట్టేలా ప్రేరేపించింది ‘అ’ కథ. కథ వినగానే తానే నిర్మాతగా మారి సినిమా రూపొందించానుకున్నాడు ఓ యంగ్ హీరో. కాజల్, నిత్యా మీనన్, రెజీనా తదితర భారీ కాస్టింగ్ కూడా కుదిరింది. ఇంకేముంది.. అన్నీ కుదిరాయి. సినిమా సెట్స్ మీదికెళ్లింది. విడుదలకు ముందే సంచనాలు సృష్టించింది. కానీ, ఎందుకో బాక్సాఫీస్ వద్ద సినిమాకి ఆశించిన రిజల్ట్ దక్కలేదు. దాంతో ‘అ’ంత గొప్ప స్కిప్టుకి ఆదరణ కరువైపోయింది. ఈ స్టోరీ అంతా ఏ సినిమాకి సంబంధించిందో ఈ పాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది.
అవును ‘అ!’ సినిమానే. సినిమా సక్సెస్ కాకపోయినా, అప్పట్లో ఈ డైరెక్టర్ పేరు తెగ మార్మోగిపోయింది. దాంతో సీనియర్ డైరెక్టర్ రాజశేఖర్ సినిమాని తెరకెక్కించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆయన పేరు గుర్తుంది కదా. ప్రశాంత్ వర్మ. రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమాని తెరకెక్కించాడు. ఇది కూడా పోజిటివ్ రిజల్ట్ ఇవ్వలేదనుకోండి. దాంతో ఈ డైరెక్టర్ రేసులోంచి పక్కకి తప్పుకోవల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే డైరెక్టర్ తన వద్ద మళ్లీ ఓ క్రేజీ స్క్రిప్టు సిద్ధంగా ఉంది. కానీ, సెట్స్ మీదికి తీసుకెళ్లేందుకు క్రేజీ డైరెక్టర్ కావాలి.. అంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ ఈయన దగ్గర ఉన్న ఆ క్రేజీ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ‘అ.!’ కి సీక్వెల్ అట. మరి తొలి పార్ట్‌తో నానిని ఇంప్రెస్ చేసిన ప్రశాంత్ వర్మ, ఈ సీక్వెల్ సబ్జెక్ట్‌తో ఎవర్నీ ఇంప్రెస్ చేయలేకపోతున్నాడా? ఏమో.. ఆయనకే తెలియాలి.