అల వైకుంఠపురములో హిట్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు త్రివిక్రమ్. ఇదే జోరులో ఎన్టీఆర్ తో సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన `అయిననూ పోయి రావలె హస్తినకు` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు కథా వస్తువు కూడా బయటకు వచ్చేసింది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని ప్రచారం మొదలైంది. నందమూరి కుటుంబానికీ - రాజకీయాలకూ దగ్గర సంబంధం ఉంది. తెరపై హీరోల్ని పొలిటీషన్లుగా చూడడానికి అభిమానులు సైతం ఆశగా ఎదురుచూస్తారు. ఎన్టీఆర్ నోట.. త్రివిక్రమ్ పొలిటికల్ పంచ్‌లు వేయిస్తే... ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే ఈ సినిమా పొలిటికల్ సెటైర్ అనగానే అభిమానులూ అంచనాలు పెంచుకున్నారు.
అయితే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ పూర్తిగా ఓ ఫ్యామిలీ డ్రామాని తీస్తున్నాడని, ఇందులో రాజకీయ అంశాలు ఏమాత్రంఉండవని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌తో గతంలో తీసిన `అరవింద సామెత` సీరియస్ గా సాగిన సినిమా. ఆ తరవాత.. అల వైకుంఠపురముతో ఫ్యామిలీ డ్రామాకు షిఫ్ట్ అయ్యాడు త్రివిక్రమ్. ఆసినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ ఓ సీరియస్ సినిమా తీసే అవకాశాలు లేవు. పైగా ఎన్టీఆర్ కూడా `నాకు ఫ్యామిలీ డ్రామా` కావాలి అని గట్టిగాచెప్పాడట. సో.. ఈసారి ఎలాంటి పొలిటికల్ ఎఫెక్టులూ లేనట్టే.