ఓటీటీ వల్ల సినిమాలకు మంచే జరుగుతోంది. థియేటర్లు అందుబాటులో లేని సమయంలో - ప్రేక్షకులకు సినిమా అనుభూతిని మళ్లీ గుర్తు చేస్తోంది ఓటీటీ. ఇక రచయితలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు కావల్సినంత పని దొరుకుతోంది. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ లాంటి సంస్థలైతే, దర్శకులకు మంచి పారితోషికాలు ఇచ్చి - ఆకర్షిస్తోంది.
తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోంది. లస్ట్ స్టోరీస్ టైపులో, లవ్ స్టోరీస్ ని తెరపై చూపించాలని ప్లాన్ చేస్తోంది. నాలుగు కథలు, నలుగురు దర్శకులతో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. అందులో ఇద్దరు దర్శకులుగా అజయ్ భూపతి, శివ నిర్వాణ ఫిక్స్ అయ్యారు. మరో ఇద్దరు దర్శకుల్ని వెదికి పట్టుకునే పనిలో ఉంది. వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ నలుగురి చేత నాలుగు ఎపిసోడ్లు చేయించాలన్నది నెట్ ఫిక్స్ ప్లాన్. అందుకోసం భారీ బడ్జెట్ కేటాయించబోతోందట. వీళ్ల పారితోషికాలు కూడా సినిమాలకు తగ్గకుండా ఉండబోతున్నాయని టాక్. ఈవెబ్ సిరీస్‌లో పేరున్న నటీనటులే కనిపిస్తార్ట. వివరాలు త్వరలో తెలుస్తాయి.