ప్రతిరోజూ పండగే తరవాత.. మారుతి సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. రామ్ తో ఓ సినిమా చేయాలనుకున్నాడు. అది కుదర్లేదు. ఆ తరవాత రవితేజతో భేటీ వేశాడు. ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నదని గట్టిగానే ప్రచారం సాగింది. కానీ ఏమైందో, ఏమో.. ఆ ప్రాజెక్టుకి బ్రేకులు పడిపోయాయి.
ఇప్పుడు అదే కథతో.. బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరకు వెళ్లినట్టు సమాచారం. బెల్లంకొండ కూడా మారుతితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉంది. అక్టోబరులో షూటింగ్ మొదలెట్టి.. జనవరి నాటికి సినిమా పూర్తి చేయాలన్న ప్లానింగులో ఉన్నాడు మారుతి. అన్నీకుదిరితే.. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేస్తుంది.