టాలీవుడ్ లో రకరకాల వ్యక్తులు.. ఆ ముసుగుల మాటున కొత్త కొత్త మోసాలు. కొన్ని వెలుగులోకి వస్తాయి. ఇంకొన్ని రావు. తాజాగా మరో ఘరానా మోసం బయటపడింది. 'ఫలానా హీరోయిన్ని మీ కోసం మీరూముకి పంపుతా' అంటూ ఓ వ్యక్తి భారీగా డబ్బులు గుంజాడు. హీరోయిన్ల పేరు చెప్పి, ఆశ చూపించి.. డబ్బులు వసూలు చేశాడు. తీరా చూస్తే... అంతా భోగస్ అని అర్థమైంది. హీరోయిన్లని చూసి రెచ్చిపోయి డబ్బులు చల్లినవాళ్లంతా ఇప్పుడు సదరు మోసగాడిపై కేసు వేశారు.
అంత తేలిగ్గా ఎలా మోసపోతారు? అనే సందేహం ఎవరికైనా రావొచ్చు. కాకపోతే.. అలా మోసిం చేసింది ఎవరో కాదు. టాలీవుడ్లో పేరు పొందిన ఓ మేనేజర్. దాదాపు ఆరేడు మంది కథానాయికల కాల్సీట్లు చూస్తుంటాడు. టాలీవుడ్ పెద్దలతోనూ అనుబంధం ఉంది. అందుకే సదురు వ్యక్తి మాట మాటల్ని నమ్మి మోసపోయారంతా.
డిసెంబరు 31న హైదరాబాద్‌లో ఓ పార్టీ ఏర్పాటు చేసి, అక్కడికి హీరోయిన్లను రప్పిస్తానని మాట ఇచ్చి, భారీగా డబ్బులు వసూలు చేశాడు. కానీ.. హీరోయిన్లెవరూ రాకపోయే సరికి... ఇప్పుడు ఆ మేనేజర్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. సదరు మోసగాడ్ని పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు కూడా పంపారు.