మే లో టఫ్ బాక్సాఫీస్ ఫైట్

మరిన్ని వార్తలు

2025 లో టాలీవుడ్ జర్నీ ఇప్పటికి కొంచెం బాగానే ఉంది. జనవరిలో కొన్ని సినిమాలు రిలీజ్ అవగా వీటిలో సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ విజయాలతో టాలివుడ్ బోణీ కొట్టింది. ఫిబ్రవరిలో అత్యధిక సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వీటిలో తండేల్ ఒకటే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫిబ్రవరి ఎండింగ్ లో వచ్చిన మాజాకా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మార్చ్ లో మరికొన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా 'నారి' మూవీ మార్చ్ 7 న రిలీజ్ అవుతొంది. ఇదే రోజు తెలుగు వెర్షన్ 'చావా' కూడా రిలీజ్ అవుతోంది.

నాని నిర్మాణంలో ప్రియదర్శి మెయిన్ లీడ్ లో నటించిన కోర్టు మార్చ్ 14న రిలీజ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం 'దిల్ రూబా' కూడా ఇదే రోజు రిలీజ్ అవుతోంది. నితిన్‌, శ్రీలీల కాంబో మూవీ 'రాబిన్‌హుడ్‌' మార్చి 28న రానుంది. వీటిలో ఏవి హిట్ అన్నది చెప్పటం కష్టం. మార్చ్ లో వచ్చే సినిమాలకంటే మే బాక్సాఫీస్ ఫైట్ పై అందరి ద్రుష్టి పడింది. కారణం మే లో స్టార్ హీరో సినిమాలు భారీ అంచనాలున్న సినిమాలు వస్తున్నాయి. ఇందులో ఒకటి నాని 'హిట్ 3 '. నాని ప్రొడక్షన్ లోనే ఇప్పటికి హిట్ సిరీస్ లు రెండు వచ్చాయి. ఇవి రెండు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని హిట్ 3 పై భారీ అంచనాలు నెలకొల్పింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. హిట్ 3 మే1న రిలీజ్ అవుతోంది.

మే 1 న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా  'రెట్రో' మూవీతో బరిలో దిగుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ మూవీలో సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. సూర్య కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఒకే రోజు నాని, సూర్య పోటీ పడుతుండటంతో  వీరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని క్రిటిక్స్ అంచనా. మే 30 న విజయ్ దేవరకొండ 'కింగ్‌ డమ్' రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో విజయ్ డిఫరెంట్ రోల్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇలా ఒకే నెలలో ముగ్గరు స్టార్ హీరోలు, హైప్ ఉన్న సినిమాలతో రానుండటం విశేషం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS