తెలుగు సినిమా పరిశ్రమకి దాసరి మరణంతో పెద్ద తలకాయ లేకుండా పోయినట్లైంది. ఏదైనా వివాదం సినీ పరిశ్రమని వెంటాడుతుంటే, దాసరి వెంటనే కల్పించుకునేవారు. ఇరువర్గాల వారితోనూ సంప్రదింపులు చేసి, సామరస్యంగా సమస్యని శాంతింపచేసేశారు. అదీ పెద్దరికం అంటే. ఆ పెద్దరికానికే ఆయనను అంతా అమితంగా గౌరవించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఎంత మంది ఉన్నా ఆ లోటు తీర్చనిదే. ఇప్పటి పరిస్థితుల్లో ఇండ్రస్టీకి వచ్చానా, పెట్టుబడి పెట్టేనా? సంపాదించుకుని వెళ్లానా? అని ఆలోచిస్తున్నారు చాలా మంది ప్రముఖులు.
ప్రస్తుతం టాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న సమస్య శ్రీరెడ్డి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ చాలా నార్మల్‌గా స్టార్ట్ అయినప్పటికీ, అత్యంత తీవ్రమైన అంశంగా దాపురించింది. తెలుగు సినిమా పరువును బజారుకీడ్చేసింది ఈ నటి శ్రీరెడ్డి. తనకి అన్యాయం జరిగితే, జరిగిన వాళ్ల దగ్గరికి వెళ్లి నిరసన చేయాలి తప్ప, ఇలా ఇండస్ట్రీ మొత్తం మీద అసత్య ఆరోపణలు చేయడం సబబు కాదని ఎవరెన్ని చెప్పినా ఆమె వినే పరిస్థితిలో లేదు.
ఇకపోతే ముఖ్యంగా పెద్ద తలకాయలేవీ ఈ విషయంలో స్పందించడం లేదు. దాంతో ఎవరి నోటికొచ్చింది వారు మాట్లాడేస్తున్నారు. దాంతో సినీ పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ, ప్రజల్లోనూ ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది. దాసరి బతికుంటే, సినీ పరిశ్రమకి ఈ దుస్థితి వచ్చేది కాదు అని.