శ్రీరెడ్డి లీక్స్‌ నెక్ట్‌ టార్గెట్ ఎవరో తెలిసిపోయింది..!

By iQlikMovies - April 12, 2018 - 17:10 PM IST

మరిన్ని వార్తలు

తాజాగా దర్శకుడు కొరటాల శివ పేరును బయట పెట్టి, కొరటాల శివ తననేదో చేసేందుకు ప్రయత్నించాడనీ, అసభ్యంగా ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి లీక్స్‌ లిస్టులో నెక్ట్స్‌ ఓ యంగ్‌హీరో పేరు వినిపిస్తోంది. ఆ యంగ్‌ హీరోకి సంబంధించి శ్రీరెడ్డి ఓ వీడియో రిలీజ్‌ చేయనుందట. అయితే ఆ వీడియోని రిలీజ్‌ చేయకుండా ఉండేందుకు ఆ యంగ్‌హీరో తెర వెనుక చాలా ప్రయత్నాలే చేస్తున్నాడట. వీడియో పేరు చెప్పి శ్రీరెడ్డి, ఆ యంగ్‌ హీరోని బ్లాక్‌ మెయిల్‌ చేస్తోందనే గాసిప్స్‌ కూడా వినిపిస్తున్నాయి.

సోషల్‌ మీడియా వేదికగా ఆ యంగ్‌ హీరోకి సంబంధించి, ఆల్రెడీ ఓ హింట్‌ కూడా ఇచ్చింది శ్రీరెడ్డి . దాంతో ఆ యంగ్‌ హీరో అతనేనా ? కాదా? అనే చర్చ మొదలైంది. ఇంతకీ ఆ యంగ్‌ హీరో ఎవరు? తొందరెండుకు త్వరలోనే తెలిసిపోతుంది. ఈ లోగా ఆ హీరో బయటికి వస్తే వచ్చినట్లు? లేదంటే శ్రీ రెడ్డినే పేరుతో పాటు, రివీల్‌ చేసేస్తుంది. అయితే నిజంగానే ఆ యంగ్‌ హీరోపై శ్రీరెడ్ది చేసే ఆరోపణలు వాస్తవాలేనా? లేక పబ్లిసిటీ స్టంట్‌ చేసి, ఆ యంగ్‌ హీరో పరువు తీసేందుకు శ్రీరెడ్డి పాల్పడిందా?

ఇలాంటి పలు రకాల ప్రశ్నలు సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఏకంగా స్టార్‌ డైరెక్టర్స్‌, ప్రముఖ నిర్మాతల్నే శ్రీరెడ్డి బజారుకీడ్చేసింది . అలాంటిది పాపం ఆ యంగ్‌ హీరో పరిస్థితేంటని వాపోతున్నారు ప్రేక్షకులు. చూడాలి మరి శ్రీరెడ్డి ఏం చేస్తుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS