వెబ్ సిరీస్ అనగానే చాలామందికి ‘లస్ట్ స్టోరీస్’ గుర్తుకొస్తోంది. ప్రముఖ హీరోయిన్లు అందులో నటించడం, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు అందులో ఇన్వాల్వ్ అవడమే అందుక్కారణం. కానీ, ట్రెండ్ మారింది. ఇప్పుడంతా వెబ్ సిరీస్‌ల వైపు ఉత్సాహం చూపుతున్నారు. కంటెంట్ కొంత హాట్‌గా వుంటున్నా, కొత్త ట్రెండ్‌లోకి వెళ్ళాల్సిందేనన్న అభిప్రాయంతో పెద్ద నిర్మాతలూ అటువైపు చూస్తున్న విషయం విదితమే. హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపుతుండడం గమనార్హం. అయితే, ‘వెబ్ సిరీస్ అంటే కేవలం బూతు మాత్రమే కాదు..’ అంటోంది హీరోయిన్ వాణి భోజన్.
‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాలో నటించిన వాణి భోజన్, తమిళనటుడు ‘జై’తో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతోంది. చాలా వెబ్ సిరీస్‌లు అడల్ట్ కంటెంట్ లేకుండానే రూపొందుతున్నాయి, నేను చేయబోయేది కూడా అదేనని వాణీ బోజన్ చెప్పింది. మంచి మెసేజ్ ఇచ్చే క్రమంలో కొన్ని సార్లు బోల్డ్‌నెస్ అవసరమవ్వొచ్చనీ, దాన్ని తాను వ్యతిరేకించననీ, తాను చేస్తున్నది మాత్రం చాలా క్లీన్ వెబ్ సిరీస్ అనీ, వెబ్ సిరీస్‌ల పట్ల ‘బూతు’ అనే ఆలోచన మానుకోవాలనీ వాణి భోజన్ ఉచిత సలహాలు ఇస్తోంది. ఎవరెన్ని చెప్పినా, వెబ్ సిరీస్‌లపై పడ్డ ‘బూతు’ ముద్ర మాత్రం చెరిగిపోయేలా లేదు. ఎందుకంటే, అలాంటి కంటెంట్ లభ్యవముతోంది ఓటీటీల్లో.