Top Gear Review: 'టాప్ గేర్' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు: ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ

దర్శకుడు : శశికాంత్

నిర్మాత: కె.వి.శ్రీధర్ రెడ్డి

సంగీత దర్శకులు: హర్షవర్ధన్ రామేశ్వర్

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

రేటింగ్ : 2.25

ఆది సాయి కుమార్ విభిన్నమైన జోనర్స్ ప్రయత్నిస్తున్నాడు. జయాపజయాలకు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఆది నుండి దాదాపు అరడజను సినిమాలు వచ్చాయి. ఇప్పుడు యేడాది చివర్లో టాప్ గేర్ తో ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఆదికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది ? టాప్ గేర్ ప్రయాణంలో ప్రేక్షకుడు ఎలాంటి అనుభూతిని పొందాడు ? 

కథ:

అర్జున్ (ఆది సాయికుమార్) క్యాబ్ డ్రైవర్. ఆద్య (రియా సుమన్)ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. సిద్దార్థ్ (మైమ్ గోపీ) పెద్ద డ్రగ్ డీలర్. కోట్ల విలువైన ఓ బ్యాగ్ డ్రగ్స్‌ హైద్రాబాద్‌లో చిక్కుకుంటాయి. అనుకోని ఓ ప్రమాణం వలన క్యాబ్ డ్రైవర్‌ అర్జు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంటుంది. దీంతో సిద్దార్థ్ , ఏపీసీ విక్రమ్(శత్రు)అందరూ అర్జున్‌ను టార్గెట్ చేస్తుంటారు. అలాగే అర్జున్ భార్య అధ్య కూడా ప్రమాదంలో పడుతుంది. వీరి నుండి అర్జున్ ఎలా తన భార్యని కాపాడుకుంటాడు? అసలు ఆ బ్యాగ్ ఎవరి దగ్గరకు చేరింది? డేవిడ్ అనే వ్యక్తి ఎవరు? చివరకు ఈ డ్రగ్స్ కేసు ఎలా ముగుస్తుంది? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఒక బిగినింగ్.. రెండు ట్విస్ట్ లు అనుకోను.. ఇదే బ్రహ్మండమని ఈ కథని సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయారనే భావన కలుగుతుంది టాప్ గేర్ చూస్తుంటే. ఒక డ్రగ్స్ బ్యాగ్ చుట్టూ జరిగే కథ ఇది. అయితే కథ మొదలవ్వడానికే ఇంటర్వెల్ వరకూ సమయం తీసుకున్నాడు దర్శకుడు. కథ మొత్తం ఒక రాత్రిలో జరుగుతుంది. ఈ ఆలోచన బాగానే వుంది. అయితే స్క్రీన్ ప్లే నడిచిన తీరు మాత్రం అంత టైట్ గా వుండదు. ఇలాంటి కథల్లో నెక్ట్స్ ఏం జరుగుతుంది? అనే ఆసక్తి వుండాలి కానీ టాప్ గేర్ విషయంలో అది లేదు. ఒక్క రాత్రిలో జరిగే కథ అని అనగానే కార్తీ ఖైదీ గుర్తుకు వస్తుంది. ఇందులో కూడా ఆ ఎమోషన్ ని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే అది సరిగ్గా కుదరలేదు.

సెకండ్ హాఫ్ చిత్రానికి ప్రధాన మైనస్. డేవిడ్ ని పట్టుకోవడం విరామం తర్వాత హీరో మిషన్. అయితే ఆ పట్టుకునే క్రమం చాలా సాగాదీతలా అనిపిస్తుంది. హీరో క్యాబ్ డ్రైవర్ అయిన పాపానికి దర్శకుడు ఎలాంటి డైరెక్షన్ లేకుండా హీరో గారిని రోడ్లపై తిప్పుతూనే ఉంటాడు. ఒక దశలో డేవిడ్ పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ మరీ సిల్లీగా వుంటుంది. అది దర్శకుడు గొప్ప ట్విస్ట్ అని భావించి ఉంటాడు కానీ అది తెరపై చాలా సిల్లీగా వచ్చింది. దాని తర్వాత ఈ కథపై ప్రేక్షకుడి ఆసక్తి తగ్గిపోతుంది. ముగింపు కూడా రొటీన్ గానే వుంటుంది. ఇలాంటి కథలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అవసరం. కానీ దర్శకుడు ఈ విషయంలో పెద్ద ద్రుష్టి పెట్టినట్లుగా కనిపించదు. పైగా రైటింగ్ చాలా వీక్ గా వుంటుంది. ఇంకాస్త పరిణితితో రాయాల్సింది. 

నటీనటులు:

అర్జున్ పాత్రలో సహజంగా కనిపించాడు ఆది. యాక్షన్ సీన్లు చక్కగా చేశాడు. హీరోయిన్‌గా నటించిన రియా సుమన్‌ అందంగా వుంది. ఏసీపీగా శత్రు మెప్పిస్తాడు.

సిద్దార్థ్ పాత్రలో మైమ్ గోపి ఆకట్టుకుంటాడు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్‌ ఇలా అందరూ కూడా తమ పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ :

హర్షవర్దన్ రామేశ్వర్ ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణ. కెమెరా వర్క్ కూడా డీసెంట్ గా వుంది.

నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా వున్నాయి. పాటలు, డైలాగులకు పెద్ద ప్రాధన్యత లేదు. 

ప్లస్ పాయింట్స్

ఆది 

నేపధ్య సంగీతం 

మైనస్ పాయింట్స్

బలహీనమైన కథ, కథనం 

సెకండ్ హాఫ్ 

ఎమోషన్ మిస్ అవ్వడం

ఫైనల్ వర్దిక్ : గేర్ ఫెయిల్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS