స్టార్‌ హీరోస్‌ మెప్పు పొందుతున్న ఫిదా బ్యూటీ.!

మరిన్ని వార్తలు

తన యాక్టింగ్‌తో, అదిరిపోయే స్టెప్పులతో యూత్‌ని ఎప్పుడో ఇంప్రెస్‌ చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి , తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోస్‌నీ ఇంప్రెస్‌ చేస్తోంది. ఇంతవరకూ చిన్న హీరోలకే పరిమితమైన ఈ మలర్‌ బ్యూటీ ఇకపై స్టార్‌ హీరోలతోనూ జత కట్టే అవకాశా లున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కు ఫేవరేట్‌ హీరోయిన్‌గా మారిపోయింది సాయి పల్లవి. అయితే ఫేవరేట్‌ హీరోయిన్‌ అని చెప్పడం వేరు, తమ తమ సినిమాల్లో హీరోయిన్‌గా ఛాన్స్‌ ఇవ్వడం వేరు.. కదా.! ఈ రీజన్‌తో సాయి పల్లవికి ఈ స్టార్‌ హీరో సరసన ఛాన్స్‌ దక్కే అవకాశాలున్నాయో లేదో తెలీదు కానీ, సాయి పల్లవి ఉందంటే, ఆ హీరోలను డామినేట్‌ చేసేయడం మాత్రం ఖాయం. ఆమె తొలి సినిమా నుండీ ఇదే కంటిన్యూ అవుతూ వస్తోంది.

 

మరో ముఖ్య విషయం ఏంటంటే, స్టార్‌ హీరోస్‌ సినిమాలంటే, కమర్షియల్‌ వాల్యూస్ కి ప్రాధాన్యత ఎక్కువ వుంటుంది. హీరోయిన్‌ గ్లామర్‌ అందులో కీలకమైంది. కానీ, మన మలయాళ కుట్టి గ్లామర్‌ని పెద్దగా ప్రోత్సహించదు కదా. సో ఆయా రీజన్స్‌.. సాయి పల్లవికి స్టామినా ఉన్నా, స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ని దూరం చేసేస్తుంటాయ్‌. ఇకపోతే, ప్రస్తుతం రానాతో ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి, నాగ చైతన్యతో ‘లవ్‌స్టోరీ’ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం సెట్స్‌ మీదే ఉన్నాయి. సమ్మర్‌లో రిలీజ్‌కి రెడీ అవ్వాల్సిన ఈ సినిమాలు కరోనా కారణంగా వెనకబడిపోయిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS