అన్నీ ఉన్నా, అదృష్టం కలిసి రాకుంటే అవకాశాలు రావంతే. ఇది ముద్దుగుమ్మలకు వర్తించే హాట్ మంత్ర. అయితే ఇప్పుడు ఎవరికింత పాటి కష్టం వచ్చిందంటే, 'సూర్య వెర్సస్ సూర్య' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ త్రిధా చౌదరి గుర్తుంది కదా. అదేనండీ ఇటీవల 'మనసుకు నచ్చింది' సినిమాతోనూ మరోసారి ఆడియన్స్‌కి హాయ్ చెప్పింది ఈ క్యూట్ భామ. అయితే హాయ్ తోనే సరిపెట్టుకుంది. హిట్ మాత్రం ఆమె దరి చేరలేదు. మహేష్ సోదరి మంజుల దర్శకత్వంలో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎట్రాక్ట్ చేసింది. కానీ విడుదలయ్యాక 'ఎక్స్‌క్యూజ్‌మీ' అనిపించేసింది. ఈ సినిమాలో అమైరా దస్తూర్ ఓ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్‌గా త్రిధా చౌదరి నటించింది. సినిమా ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోవడంతో ఇదిగో ఇలా బీచ్‌లో అందాలారబోస్తూ, నెక్స్ట్ ఆఫర్ కోసం ఎర వేస్తోంది. చూస్తున్నారుగా దాదాపు బికినీ లాంటి డ్రస్సులో కనీ కనిపించనట్లుగా అందాలన్నింటినీ ఆరబోతకు పెట్టింది. పింక్ బోటమ్ ఇన్నర్‌లో, వైట్ ట్రాన్స్‌పరెంటెడ్ టాప్‌లో హాట్ హాట్ త్రిథా నీ అందాలదిరేలా.. అనిపిస్తోంది.