బుల్లితెరపై ప్రసారమవుతున్న మెగా రియాల్టీ షో బిగ్‌బాస్‌లో తాజాగా రన్ అవుతోన్న కాల్ సెంటర్ టాస్క్‌లో కౌషల్‌ని చడా మడా వాయించేసింది గీతా మాధురి. స్టార్టింగ్ నుండీ ఇప్పటిదాకా బిగ్‌బాస్‌లో జరిగిన ఇష్యూస్‌కి సంబంధించి ప్రస్థావన తీసుకొచ్చి, కౌషల్‌ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది గీతా మాధురి.
అయినా ఎక్కడా కౌషల్ గీత దాటలేదు. నవ్వుతూనే అన్నింటికీ సమాధానమిచ్చాడు . కౌషల్‌ని రెచ్చగొట్టడంలో విశ్వ ప్రయత్నం చేసి విఫలమైన గీత ఫోన్ పెట్టేసి వెళ్లిపోయింది. ఈ ఇష్యూని అదునుగా తీసుకున్న సోషల్ మీడియాలోని కౌషల్ ఆర్మీకి గీత టార్గెట్ అయిపోయింది. బిగ్‌బాస్ స్టార్టింగ్ నుండీ బిగ్‌బాస్ హౌస్ మేట్స్‌లో కొంత మందికి కౌషల్ టార్గెట్ అవుతూ వస్తున్నాడు. హౌస్‌లో కౌషల్‌తో పెట్టుకున్న వారందరూ దాదాపుగా అదే రీజన్‌తో హౌస్ నుండి బయటికొచ్చేస్తున్నారు కూడా. ఇది యాదృచ్ఛికమా.? లేక నిజంగానే ఇలా జరుగుతోందా? అనే విషయం పక్కన పెడితే, జస్ట్ ఇదో గేమ్ షో అన్న విషయాన్ని మర్చిపోతున్నారు సోషల్ మీడియా నెటిజన్లు.
సోషల్ మీడియా వేదికగా కౌషల్‌కి సపోర్ట్‌గా, ఆయనను వ్యతిరేకించే హౌస్ మేట్స్‌ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. నిన్న మొన్నటి దాకా బాబు గోగినేని కౌషల్ ఆర్మీ విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. గత వారం ఆయన హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోవడంతో, ఆ టార్గెట్ ఇప్పుడు గీతపై పడింది.
చూడాలి మరి, కౌషల్‌ని టార్గెట్ చేసిన గీత ఈ వారం హౌస్ నుండి బయటికి వచ్చేస్తుందో ఏమో.