రిస్క్ చేయకపోతే లైఫ్‌లో రస్క్ కూడా దొరకదు. ప్రస్తుతం సినిమా మార్కెట్ చాలా పెరిగింది. ఈ పెరిగిన మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని రిస్క్ చేయడం తప్పదంటున్నాడు యంగ్ హీరో అడవిశేష్. అడవిశేష్ హీరో మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్. సినిమాకి సంబంధించిన చాలా విషయాల్లో మంచి పట్టుంది అడవిశేష్‌కి. 'గూఢచారి' సినిమాతో గతేడాది మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న సినిమానే అయినా ఎంతో రిచ్ లుక్‌లో చూపించి హాలీవుడ్ స్థాయి నిర్మాణ వేల్యూస్‌ని తక్కువ బడ్జెట్‌లోనే చూపించి సత్తా చాటాడు.
అందుకే 'గూఢచారి' విమర్శకుల ప్రశంసల్ని అందుకోవడంతో పాటు, మంచి వసూళ్లు కూడా రాబట్టింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో 'గూఢచారి'కి సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడు అడవిశేష్. ఈ సీక్వెల్‌కి 'త్రినేత్ర 116' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు.. రాహుల్ పాకాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అయితే 'గూఢచారి'ని మించిన గ్రాండియర్ లుక్‌తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట అడవిశేష్.
బడ్జెట్ విషయంలో కూడా అంతకు మించి ఆలోచనలు చేస్తున్నాడట. రిస్క్ చేయకపోతే కుదరదంటున్నాడు. కథపై పూర్తి నమ్మకంతోనే భారీ బడ్జెట్‌తో పెద్ద చిత్రంగా 'త్రినేత్ర 116'ని రూపొందించబోతున్నాడట. వచ్చే ఏడాది మిడిల్‌లో ఈ సినిమాని ప్రారంభించనున్నామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.