ముద్దుగుమ్మ త్రిష తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది నుండి పది సినిమాల దాకా ఉన్నాయి. వీటిలో చాలా వరకూ సెట్స్‌పైనే ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుగులోనూ విడుదలవుతాయి. అయితే త్రిషకు ప్రస్తుతం తమిళంలో ఉన్న క్రేజ్ తెలుగులో కనిపించడం లేదు. దాంతో త్రిష తెలుగులో తన సినిమాల ప్రమోషన్ నిమిత్తం స్వయంగా బాధ్యత తీసుకోవాలనుకుంటోందట. అందుకోసం త్వరలోనే హైద్రాబాద్ రానుందట త్రిష.
నిజానికి త్రిష ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. స్టార్ హీరోలందరి సరసన నటించింది. అయితే ఇప్పుడు త్రిషను తెలుగు ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. భారీ ఆశలతో వచ్చిన 'నాయకి' సినిమా తెలుగులో దారుణంగా నిరాశపరిచింది త్రిషని. దాంతో తెలుగులో త్రిష మార్కెట్ పడిపోయింది. అందుకే రాబోయే సినిమాల విషయంలో త్రిష ప్రత్యేక దృష్టి పెట్టనుందట. తెలుగులో తనని తాను కొత్తగా ప్రమోట్ చేసుకునే ఆలోచనలో ఉందట. తెలుగు ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తోందట. 'మోహని' తదితర చిత్రాల ప్రమోషన్ నిమిత్తం త్వరలోనే త్రిష హైద్రాబాద్‌లో సందడి చేయనుందని తెలుస్తోంది.
మరో పక్క తెలుగులో కూడా సినిమాలు చేయడానికి త్రిష సిద్ధంగానే ఉంది. అయితే ఆమెను అవకాశాలే వరించాలి. రాబోయే డబ్బింగ్ చిత్రాల్లో ఏ ఒక్కటి విజయం సాధించినా, తెలుగులో త్రిషకు పూర్వ వైభవం వస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాదు రాబోయే చిత్రాల్లో ఎక్కువ భాగం హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కావడం త్రిషకు మరో ప్లస్ పాయింట్. అయితే త్రిష కొత్త ప్లాన్ వర్కవుటవుతుందా..? తెలుగు ఆడియన్స్ దృష్టిని మళ్లీ తన వైపు తిప్పుకోవడంలో త్రిష సక్సెస్ అవుతుందో లేదో..చూడాలి మరి.