నందమూరి బాలకృష్ణ - త్రిష.. ఈ కాంబినేషన్ ని ఇది వరకే చూసేశాం. `లయన్`లో వీరిద్దరూ జోడీ కట్టారు. మరోసారి ఈ జంట వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమైందట. బాలయ్య ఇప్పుడు `అఖండ`గా దర్శనమివ్వబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకుడు. ఆ తరవాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. కథ కూడా దాదాపుగా రెడీ.
ఈ చిత్రంలో కథానాయికగా త్రిషని ఎంచుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. గోపీచంద్ మలినేనికి శ్రుతిహాసన్ అంటే సెంటిమెంట్. తన బలుపు, క్రాక్ సినిమాల్లో తనే హీరోయిన్. ఆరెండు సినిమాలూ హిట్టయ్యాయి. తాజాగా బాలయ్య సినిమా కీ శ్రుతినే ఎంచుకుంటారని ప్రచారం జరిగింది. ఇంతలో త్రిష పేరు బయటకు వచ్చింది. అంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా? లేదంటే వీళ్లలో ఒకరినే ఎంచుకుంటారా? అనే విషయాల్లో క్లారిటీ రావాల్సివుంది.