ఆ రీమేక్ లో తల్లి పాత్రలో త్రిష.

మరిన్ని వార్తలు

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన 'జెర్సీ' బాక్సాఫీసు దగ్గర విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాను ఇప్పటికే షాహిద్ కపూర్ హీరోగా హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను తమిళ భాషలోకి రీమేక్ చేసేందుకు కూడా జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ వెర్షన్లో యువ హీరో విష్ణు విశాల్ నటిస్తాడని సమాచారం.

 

అయితే హీరోయిన్ పాత్ర కోసం నిర్మాతలు ఇప్పటికే నయనతార అమలాపాల్ ను సంప్రదించారని, అయితే తల్లి పాత్రలో నటించేందుకు వారు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మరో హీరోయిన్ కోసం వెతకడం మొదలు పెట్టారట. ఈమధ్య హీరోయిన్ త్రిషను సంప్రదించగా ఆమె ఈ రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ నటించిన పాత్ర త్రిషకు ఎంతగానో వచ్చిందట. దీంతో ఈ సినిమాలో నటించేందుకు పెద్దగా సమయం తీసుకోకుండా 'యస్' చెప్పిందని అంటున్నారు.

 

త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS