ల్యాండ్ మార్క్ సినిమాకు F3 ఫిక్స్ అయిందా?

మరిన్ని వార్తలు

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో హీరో ధనుష్ నటించిన 'అసురన్' అనే చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వెంకటేష్ కెరీర్లో 74 వ చిత్రం. దీంతో ల్యాండ్ మార్క్ అయిన 75వ చిత్రంపై వెంకీ ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారట. ఈ సినిమాకు దర్శకుడుగా పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరు ఫైనలైజ్ కాలేదట. ఈ సినిమాకు కొందరు యువ దర్శకులతో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా ఈ మధ్య వినిపించింది.

 

వెంకటేష్ తో త్రివిక్రమ్ కు ఒక సినిమాకు కమిట్ మెంట్ ఉంది. 75వ సినిమాగా ఆ ప్రాజెక్ట్ చేయాలని ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని సమాచారం. అయితే దీనిపై ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదు. ఇదిలా ఉంటే 75వ సినిమాగా అనిల్ రావిపూడి తో 'F2' కు సీక్వెల్ అయితే మేలనే ఆలోచనలో వెంకటేష్ ఉన్నారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన 'F2' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాకు సీక్వెల్ గా 'F3' స్క్రిప్టును అనిల్ రావిపూడి ఇప్పటికే సిద్ధం చేశారు.

 

ఈ సినిమా అయితే కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి రిస్క్ ఉండదని, విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వెంకటేష్ భావిస్తున్నారట. #వెంకీ75 గా దాదాపు ఈ సినిమానే ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS