కోలీవుడ్ లో ఓ వార్త.. హల్ చేస్తోంది. అక్కడి మీడియా..లో ఇదే హాట్ టాపిక్. అదేమిటంటే... త్రిష, శింబు పెళ్లి చేసుకుంటున్నార్ట. కరోనా ఎఫెక్ట్ తగ్గిన వెంటనే వీరిద్దరూ థూమ్ థామ్ గా పెళ్లి చేసుకుంటారని వార్తలొస్తున్నాయి. త్రిష పెళ్లి వార్తలు బయటకు రావడం ఇదేం కొత్త కాదు. అప్పట్లో రానా- త్రిషల పెళ్లి గురించి చాలా కథనాలొచ్చాయి. ఆ తరవాత త్రిషకు వేరొకరితో నిశ్చితార్థం అయ్యింది.
పెళ్లి డేట్ కూడా ఫిక్సయ్యక... ఆ బంధం వీగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటోంది. మధ్యలో శింబుతో ప్రేమాయణం నడిపిందని వార్తలొచ్చాయి. శింబుపై ఇలాంటి గాసిప్పులు రావడం కామనే. అయితే ఇప్పుడు శింబు - త్రిషలు దగ్గరయ్యారని, వీరిద్దరూ కలిసి జీవించాలనుకుంటున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఇవైనా నిలబడతాయా? లేదంటే ఇదివరకటిలా గాలివార్తలా? అనేది కాలమే చెప్పాలి. మొత్తానికి త్రిష - శింబుల మేటర్ కోలీవుడ్ వాసులకు కావల్సినంత టైమ్ పాస్ ఇస్తోంది.