అమితాబ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ కరోనా వైరస్ బారిన పడి, నానా వతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య, ఆరాథ్యలలో సైతం కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వాళ్లు ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే సడన్ గా ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలను కూడా నానావతి ఆసుపత్రిలో చేర్పించారు. హోం క్వారెంటెన్ లో ఉంటే సరిపోతుందని భావించారు. కానీ రాత్రికి రాత్రి ఆసుపత్రిలో చేరారు.
ఐశ్వర్య, ఆరాథ్యలకు కరోనా లక్షణాలు మరింతగా పెరగడంతో ఆందోళనకు గురైన అమితాబ్ కుటుంబం వెంటనే ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలను నానావతి ఆసుపత్రికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు. అమితాబ్ ఇంటికి పూర్తిగా ఖాళీ చేశారిప్పుడు. ఆ ఇంట్లో ఎవరూ లేరు. అమితాబ్, అభిషేక్ కోలుకుంటున్నారని, వారంలోగా డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. అయితే ఈలోగానే ఐశ్వర్య, ఆరాథ్యలు ఆసుపత్రి పాలవ్వడం ఆందోళన కలిగిస్తోంది.