త్రిష విత్‌ డబుల్‌ 'మెగా' ఛాన్స్‌!

మరిన్ని వార్తలు

తెలుగులో 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ త్రిష. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని, స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. నిజానికి త్రిష కెరీర్‌ తమిళంలో స్టార్ట్‌ అయ్యింది. 'జోడి' సినిమాతో త్రిష కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించింది. అక్కడ కూడా స్టార్‌ హీరోయిన్‌గానే చెలామణీ అయ్యింది. తెలుగులో యంగ్‌ హీరోస్‌తో పాటు, చిరంజీవితో సహా అగ్ర హీరోలందరి సరసనా నటించింది. మధ్యలో నిశ్చితార్ధం నిమిత్తం కొంత గ్యాప్‌ తీసుకుంది. కానీ, అనివార్య కారణాలతో ఆ నిశ్చితార్ధం రద్దు చేసుకుని, మళ్లీ కెరీర్‌లో బిజీ అయిపోయింది.

 

ప్రస్తుతం తెలుగులో త్రిష హవా అంతగా లేదు కానీ, తమిళంలో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తో త్రిష జోరు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం త్రిష, మెగాస్టార్‌ చిరంజీవితో కొరటాల శివ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అంటే, తెలుగులో త్రిష మెగాస్టార్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుందన్న మాటే. ఈ ప్రచారంపై అధికారికంగా అనౌన్స్‌మెంట్‌ రాలేదు కానీ, తాజా సమాచారమేంటంటే, మలయాళ మెగాస్టార్‌ మోహన్‌లాల్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది అందాల త్రిష. ఇకపోతే, టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి సరసన త్రిష కన్‌ఫామ్‌నా.? కాదా.? అని అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం ఆమె ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో త్రిష కెరీర్‌ ఈ రేంజ్‌లో ఉంటే, ఇక తమిళంలో త్రిష చేయాల్సిన ప్రాజెక్టులు అరడజనుకు పైగానే ఉండడం విశేషం. సో ఇప్పుడప్పుడే త్రిష డైరీ ఖాళీ లేదనే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS