మహేష్ బాబు పరిస్థితి అడకత్తెరలో పోక చక్కలా తయారైందిప్పుడు. తన చేతిలో ఉన్న సినిమా `సర్కారు వారి పాట`. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే తరుణంలో... త్రివిక్రమ్ వచ్చి మహేష్ ని ఊరించడం మొదలెట్టాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సమయానికి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిఆమ పట్టాలెక్కేది. కానీ... `ఆర్.ఆర్.ఆర్` ప్రాజెక్టుతో ఎన్టీఆర్ ఇరుక్కుపోయాడు. అందుకే ఎన్టీఆర్ తనకు అందుబాటులోకి వచ్చేలోగా.. ఓ సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్. అందుకే ఈమధ్య మహేష్ ని కలిసొచ్చాడు త్రివిక్రమ్.
త్రివిక్రమ్ రాగానే.. మహేష్ ఆలోచనలు మారిపోయాయి. ఎట్టిపరిస్థితులలోనూ.... త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఫిక్సయిపోయాడు మహేష్. అందుకోసం వీలైతే.. `సర్కారు వారి పాట`ని పక్కన పెట్టాలని చూస్తున్నట్టు టాలీవుడ్ టాక్. అయితే.. పరశురామ్ కి మహేష్ మాటిచ్చేశాడు. ఆ సినిమాకి సంబంధించిన అడ్వాన్సులూ అందేశాయి. ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్ వేసుకుంటున్నారు. అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో సినిమాని ఆపేయడం.. నిజంగా పెద్ద షాక్. పరశురామ్ కి నో.. చెప్పడం మహేష్‌కి అంత ఈజీ కాదు. అలాగని త్రివిక్రమ్ ప్రాజెక్టునీ పక్కన పెట్టలేడు. రెండు సినిమాలూ ఒకేసారి చేయలేడు. అందుకే.. మహేష్ ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నాడని తెలుస్తోంది. అయితే... ఏ నిర్ణయం తీసుకున్నా త్వరగా తీసుకోవాల్సిందే. ఆలస్యం అయ్యే కొద్దీ.. పరిస్థితిలు మరింతగా క్లిష్టమైపోతాయి. ఇండ్రస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రకారం... మహేష్ `సర్కారు వారి పాట`ని పక్కన పెట్టి, త్రివిక్రమ్ సినిమా మొదలెడతాడని తెలుస్తోంది. మరి ఏం అవుతుందో చూడాలి.