`సరిలేరు నీకెవ్వరు` తరవాత... పరశురామ్ కి ఛాన్స్ ఇచ్చాడు మహేష్. వీళ్ల కాంబినేషన్‌లో `సర్కారు వారి పాట` మొదలు కావాలి. అమెరికాలో షూటింగ్ కోసం రంగం సిద్ధం చేసుకునేలోగా.. త్రివిక్రమ్ మహేష్‌ని కలవడం, ఇద్దరూ సినిమా గురించి చర్చించుకోవడం జరిగిపోయాయి. ఏ క్షణంలో అయినా.. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో సినిమా గురించి ప్రకటన రావొచ్చన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.
మహేష్ కూడా `మరోసారి త్రివిక్రమ్ తో పనిచేయాలనివుంది` అంటూ ట్వీట్ రూపంలో తన మనసులో మాట బయటపెట్టాడు. ఒకవేళ... మహేష్‌తో సినిమా ఓకే అయితే... `సర్కారువారి పాట`కు బ్రేకులు పడి, వెనక్కి వెళ్లేది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తన ప్లానింగ్ మొత్తం మార్చేశాడు. మహేష్ స్థానంలో ఓ యువ హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. బహుశా రామ్ తో త్రివిక్రమ్ సినిమా ఉండొచ్చు.
మహేష్ తో సినిమా పట్టాలెక్కించడానికి ఇంకొంత సమయం పడుతుంది. దాంతో.. `సర్కారు వారి పాట`కు లైన్ క్లియర్ అయినట్టు అనుకోవాలి. ఎందుకంటే.. మహేష్ రెడీ అయితే, త్రివిక్రమ్ కూడా సిద్ధంగా ఉంటే, సర్కారువారి పాట స్థానంలో వీళ్ల కాంబోలోనే సినిమా మొదలయ్యేది. త్రివిక్రమ్ మరో హీరోని వెదుక్కోవడంతో.. సర్కారువారి పాటకు ఎలాంటి అడ్డంకీ లేకుండా పోయింది.