భీష్ముడి కోసం త్రివిక్రముడు.!

మరిన్ని వార్తలు

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ,ఆ’ చిత్రం నితిన్‌ కెరీర్‌లో క్లాసిక్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే త్రివిక్రమ్‌ని నితిన్‌ గురూజీ అని ఆప్యాయంగా సంబోధిస్తారు. తన తాజా మూవీ ‘భీష్మ’ కోసం గురూజీని ఛీఫ్‌ గెస్ట్‌గా ఆహ్వానించాడు నితిన్‌. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఆశీస్సులతో ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాడు. నిజానికి ‘భీష్మ’ ప్రమోషన్స్‌ చూస్తుంటే, త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లేని తలపిస్తోంది. త్రివిక్రమ్‌ సినిమాలోని ఫ్లేవర్‌ ఈ సినిమా ప్రోమోస్‌లో ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపించింది.

 

అందుకే త్రివిక్రమ్‌ అండ దండలతో సినిమా సక్సెస్‌ కావాలని ఆయన్నే తన సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్‌గా తెచ్చుకుంటున్నాడు నితిన్‌. ఈ రోజు సాయంత్రం ‘భీష్మ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ చేతుల మీదుగా ‘భీష్మ’ ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఈవెంట్‌కి తన దేవుడు పవన్‌ కళ్యాణ్‌ని ముఖ్య అతిధిగా ఆహ్వానించానుకున్నాడు నితిన్‌. కానీ, ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఓ వైపు రాజకీయాలు, మరో వైపు ‘పింక్‌’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండడంతో, తనకు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పైనే పూర్తిగా నితిన్‌ బాధ్యతల పెట్టేశాడట. త్రివిక్రమ్‌ వస్తే ఒకటీ.. నేనొస్తే ఒకటా.? అని నితిన్‌కి ఇన్‌డైరెక్ట్‌గా తన సపోర్ట్‌ అందించాడని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారం. ఏది ఏమైతేనేం, ఈ సినిమాతో నితిన్‌ మంచి హిట్‌ కొట్టాలని మనం కూడా ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS