వెంకీ - నానిల‌తో.. త్రివిక్ర‌మ్‌?

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ రాబోతోందా? ఈసారి ఆ మ‌ల్టీస్టార‌ర్‌కి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. త్రివిక్ర‌మ్ - వెంకీ కాంబోలో ఓసినిమా వ‌స్తుంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ర‌కర‌కాల కార‌ణాల వ‌ల్ల అది సాధ్యం కాలేదు. ఈసారి మాత్రం ఈ కాంబో ప‌క్కా అని, ఈసారి... నాని కూడా వీరిద్ద‌రితో క‌ల‌వ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

నిజానికి 'అల వైకుంఠ‌పుర‌ములో' త‌ర‌వాత ఎన్టీఆర్‌తో త్రివిక్ర‌మ్ సినిమా ఫిక్స‌య్యింది. త్రివిక్ర‌మ్ కూడా ఆ ప‌నిలోనే ఉన్నాయి. అయితే... 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' ఆల‌స్యంతో.. ఎన్టీఆర్ డేట్లు స‌ర్దుబాటు అవ్వ‌డం లేదు. ఆ సినిమా పూర్త‌య్యేంత వ‌ర‌కూ త్రివిక్ర‌మ్ ఖాళీగా ఉండాలి. అందుకే ఈ లోగా ఓసినిమా చ‌క చ‌క పూర్తి చేయాల‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నాడ‌ట‌. అందుకే.. ఓ స్క్రిప్టు త‌యారు చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. అన్నీ కుదిరితే... 'నార‌ప్ప‌' పూర్త‌యిన వెంట‌నే ఈ సినిమా ప‌ట్టెలెక్కే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS