టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకులలో త్రివిక్రమ్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. ఒక్కో సినిమాకీ దాదాపు 20 కోట్ల వరకూ అందుకుంటున్నాడని టాక్. కొన్ని సినిమాల్లో తనకు వాటా కూడా ఉంటుంది. హారిక హాసిని, సితార ఎంటర్టైన్మెంట్స్ తన సొంత సంస్థల్లాంటివి. వీటిలో సినిమా చేస్తే... తనకు వాటా కూడా అందుతుంది. `భీమ్లా నాయక్` సినిమాలో త్రివిక్రమ్ కి వాటా ఉంది. అయితే ఇప్పుడు... కొత్తగా ఓ నిర్మాణ సంస్థని ప్రారంభిస్తున్నట్టు టాక్. త్వరలోనే ధనుష్ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాతో త్రివిక్రమ్ స్వయంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడట.
ఇక నుంచి ప్రతీ యేడాది కనీసం 3 సినిమాలైనా తీయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలన్నీ ఇప్పటి వరకూ హారిక హాసిని బ్యానర్ లోనే సాగాయి. ఇక మీదట... తన ప్రొడక్షన్ హోస్లో తీస్తాడన్న మాట. ఇప్పటికే త్రివిక్రమ్ కొంతమంది యువ దర్శకుల కథల్ని ఫైనల్ చేశాడట. ఆయా సినిమాల్ని త్రివిక్రమ్ సొంతంగా నిర్మించనున్నాడని తెలుస్తోంది.