పిల్లీ, కుక్క కొట్టుకుని.. చివరికి ఎలుకపై పడ్డాయట. అలా ఉంది వ్యవహారం. మైత్రీ మూవీస్ సంస్థకూ, త్రివిక్రమ్ కి మధ్య ఏవో గొడవలు ఉన్నాయి. వారిద్దరి ఈగోకి ఇప్పుడు హరీష్ శంకర్ బలవుతున్నాడన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.
విషయంలోకి వెళ్తే.. మైత్రీ మూవీస్ కి ఓ సినిమా చేస్తానని త్రివిక్రమ్ ఎప్పుడో మాట ఇచ్చాడు. అడ్వాన్స్ కూడా తీసుకొన్నాడు. అయితే మైత్రీకి సినిమా చేయడం లేదు. దాంతో మైత్రీ నిర్మాతలు గోల పెట్టారు. వ్యవహారం దర్శకుల సంఘం, నిర్మాతల మండలి వరకూ వెళ్లింది. త్రివిక్రమ్ తాను తీసుకొన్న అడ్వాన్స్ కి, వడ్డీ కూడా కలిపి చెల్లించాల్సివచ్చింది. అలా.. మైత్రీకీ, త్రివిక్రమ్ కీ చెడింది.
మైత్రీపై రివైంజ్ ఎలా తీర్చుకోవాలో తెలీక సతమతమవుతున్న త్రివిక్రమ్ కి పవన్ కల్యాణ్ రూపంలో ఓ ఆయుధం దొరికినట్టైంది. మైత్రీలో పవన్ ఓ సినిమా చేయాలి. అందుకు అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించాలి. అయితే ఈ ప్రాజెక్ట్ డిలీ అవుతూ ఉంది. దానికి కారణం.. తెర వెనుక త్రివిక్రముడే అని టాక్.
వకీల్ సాబ్ ముగిసిన వెంటనే... `భవదీయుడు భగత్ సింగ్` సినిమాని పట్టాలెక్కించాల్సింది. కానీ అదే సమయంలో `భీమ్లా నాయక్` సినిమా సెట్ చేశాడు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్టు కోసం - హరీష్ శంకర్ సినిమా పక్కన పెట్టాల్సివచ్చింది. ఇప్పుడు హరీష్ కి డేట్లు ఇద్దామనుకున్న తరుణంలో మరో రీమేక్ పవన్ చేతిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడట. సముద్రఖని దర్శకత్వం వహించిన `వీనోదయ సీతమ్` సినిమాని రీమేక్ చేసేలా పవన్‌ని ఉసిగొల్పుతున్నాడన్నట త్రివిక్రమ్. ఆయన ఏం చెబితే పవన్ అది చేస్తాడు కాబట్టి.. ఈ రీమేక్ మాయలో పడి, హరీష్ శంకర్ కథని పక్కన పెట్టేస్తున్నాడని టాక్. అలా మైత్రీ, త్రివిక్రమ్ గొడవ మధ్యలో హరీష్ నలిగిపోతున్నాడు పాపం...!