ఎన్టీఆర్‌ని వ‌దిలేసి... ఆ హీరోని సెట్ చేశాడా?

By iQlikMovies - August 07, 2020 - 13:14 PM IST

మరిన్ని వార్తలు

`అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` త‌ర‌వాత‌.. ఎన్టీఆర్ తో మ‌రో సినిమా చేయ‌డానికి సంసిద్ధం అయ్యాడు త్రివిక్ర‌మ్‌. `అల వైకుంఠ‌పుర‌ములో` త‌ర‌వాత త్రివిక్ర‌మ్ ప్రాజెక్టు ఎన్టీఆర్ తోనే. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. `అయిన‌నూ పోవ‌లె హ‌స్తిన‌కు` అనే టైటిల్ కూడా ప్ర‌చారంలో ఉంది. అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాని ప‌క్క‌న పెట్టి, మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించే ప‌నిలో త్రివిక్ర‌మ్ ఉన్నాడ‌న్న‌ది టాలీవుడ్ టాక్‌.


లాక్ డౌన్ వ‌ల్ల అంద‌రి ప్లానింగులూ తారుమారు అయ్యాయి. నిజానికి ఈ పాటికి `ఆర్‌.ఆర్‌.ఆర్‌` షూటింగ్ పూర్త‌యి.. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా మొద‌లైపోయేది. కానీ క‌రోనా వ‌ల్ల అది సాధ్యం కాలేదు. ఎన్టీఆర్ కోసమే ఆగాలంటే... త్రివిక్ర‌మ్ మ‌రో యేడాది పాటు మ‌రో సినిమా చేయ‌కూడ‌దు. కానీ అప్ప‌టి వ‌ర‌కూ ఖాళీగా ఉంటే ఎలా?  అందుకే ఈలోగా మ‌రో రెండు మూడు స్క్రిప్టులు సిద్ధం చేసుకున్నాడు త్రివిక్ర‌మ్. అందులో భాగంగా సూర్య కోసం ఓ క‌థ రెడీ చేసిన‌ట్టు టాక్‌. సూర్య‌తో ఓ సినిమా చేయాల‌ని త్రివిక్ర‌మ్ ఎప్పుడో అనుకున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య భేటీ కూడా జ‌రిగింది. కానీ సూర్య అటు త‌మిళ సినిమాతో, త్రివిక్ర‌మ్ ఇటు తెలుగు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌డంతో అది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు అందుకు స‌మ‌యం వ‌చ్చింద‌ని టాక్‌. సూర్య కోసం ఎప్పుడో సిద్ధం చేసిన క‌థ‌.. ఇప్పుడు మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీశాడ‌ట త్రివిక్ర‌మ్. అన్నీ కుదిరితే.. ఈ సినిమాని ప‌ట్టాలెక్కించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ సినిమా పూర్త‌య్యాకే ఎన్టీఆర్ ప్రాజెక్టు మొద‌లవ్వొచ్చు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS