సినిమా షూటింగ్ సమయంలో బయటకి వచ్చే లీకులు సదరు సినిమా యూనిట్ కి తీవ్ర మనోవేదన కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఇక వీటిని నివారించేందుకు షూటింగ్ సమయంలో ఎన్ని చర్యలు చేపట్టిన ఏదో ఒక విధంగా ఇలాంటి లీక్స్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా ఈ లీకుల బారిన పడిన చిత్రం ఎన్టీఆర్ అరవింద సమేత. మొన్ననే ఎన్టీఆర్-నాగబాబు కలిసి ఉన్న ఒక ఎమోషనల్ సన్నివేశానికి సంబంధించిన ఫోటో ఒకటి లీక్ అయింది. దీనికి సంబంధించి యూనిట్ వెంటనే అప్రమత్తమయినట్టుగా తెలిసింది.
ఈ తరుణంలో మరిన్ని లీకులు జరగకుండా దర్శకుడు త్రివిక్రమ్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ షూటింగ్ జరిగే ప్రదేశం వద్ద పెట్టినట్టుగా తెలుస్తున్నది. అందులో ముఖ్యంగా యూనిట్ లో ఎవ్వరు కూడా తమ మొబైల్ ఫోన్లని షూటింగ్ జరిగే ప్రాంతంకి దూరంగా వారు ఏర్పాటు చేసే ఒక స్టాల్ లో డిపాజిట్ చేయాలట.
ఇలాంటి లీకులు ఎక్కువగా మొబైల్ ఫోన్ల ద్వారానే అవుతుంది అని ఒక అంచనాకి వచ్చే ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది.