రకుల్‌ ఇలా బుక్కయిపోయిందేంటీ.!

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ లేటెస్టుగా ఓ స్టిల్‌ రిలీజ్‌ చేసింది సోషల్‌ మీడియాలో. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సూపర్‌ హాట్‌ క్లీవేజ్‌తో ఉన్న స్టిల్‌ అది. ఈ స్టిల్‌కి సోషల్‌ మీడియాలో వస్తున్న రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. 

అది ఎలాంటి రెస్పాన్స్‌ అనేది పక్కన పెడితే, అచ్చం ఇలాంటి స్టిల్లే గతంలో దిశాపటానీ రిలీజ్‌ చేసింది. అంతకు ముందు అమైరా దస్తూర్‌ తదితరులు ఈ తరహా కాస్ట్యూమ్‌లో కనిపించారు. ఆ ఫోటోలు కోడ్‌ చేస్తూ రకుల్‌ గాలి తీసేస్తున్నారు నెటిజన్లు. కాపీ క్యాట్‌ అయిపోయావ్‌ నువ్వు అని ఎగతాళి చేస్తున్నారు. ఈ మధ్య రకుల్‌ ఏం చేసినా వెటకారమైపోతోంది. రకుల్‌కి మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది.

 

'ఎన్టీఆర్‌'లో శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని చూసిన నెటిజన్లు కూడా అలాగే హేళన చేశారు. నువ్వేంటీ.? అతిలోక సుందరి పాత్రలో కనిపించడమేంటనీ వరుసపెట్టి ట్రాలింగ్‌ మొదలెట్టేశారు. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలిన సౌందర్యరాశి రకుల్‌ ప్రీత్‌సింగ్‌. అలాంటిది ఎప్పుడయితే బాలీవుడ్‌లో అడుగుపెట్టిందో. అప్పటి నుండీ టాలీవుడ్‌ ఆడియన్స్‌ నుండి ఆమెపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. బాలీవుడ్‌కెళ్లాక రకుల్‌ ప్రవర్తన, ఆటిట్యూడ్‌ని అనుక్షణం తప్పు పడుతూనే ఉన్నారు నెటిజన్లు. 

ఏది ఎలా ఉన్నా, రకుల్‌ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. తిట్టే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. అలాగే అభిమానం చూపించేవారు కూడా ఉంటారు. అలాంటి వారే నాక్కావల్సింది అని నెగిటివ్‌ కామెంట్స్‌ని సింపుల్‌గా లైట్‌ తీసుకుంటోంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS