వసూళ్ల పరంగా ఇండియన్ సినిమా 'బాహుబలి' సత్తా చాటింది. దాన్ని ప్రస్తుతానికి బ్రేక్ చేసింది అమీర్ ఖాన్ నటించిన 'దంగల్'. అయితే 'బాహుబలి' మేనియా ఇంకా పోలేదు. చైనాలో విడుదలైతే ఈ లెక్కలు మళ్లీ తారుమారు కాక తప్పదు. తాజాగా 'బాహుబలి ది కంక్లూజన్' సినిమా వసూళ్ళను దాటేస్తానని అంటున్నాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్. 'ట్యూబ్‌లైట్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు త్వరలో సల్మాన్‌ఖాన్. ప్రతి ఏడాదీ ఈద్ సందర్భంగా తన కొత్త సినిమాని అభిమానుల ముందుంచడం సల్మాన్‌ఖాన్‌కి అలవాటు. ఈ 'ఈద్'కి సల్మాన్‌ఖాన్ 'ట్యూబ్‌లైట్' సినిమాని అభిమానులకు గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా రికార్డుల్ని తిరగరాసే సినిమాలానే అనిపిస్తోంది.అయితే 'బాహుబలి ది కంక్లూజన్' సినిమాని దాటెయ్యడం అంత తేలిక కాదు. ఇప్పటిదాకా హిందీ చిత్రాల్లో 'దంగల్' అత్యధిక వసూళ్ళను సాధించిన చిత్రం. 'బాహుబలి ది కంక్లూజన్' రాక ముందువరకూ 'దంగల్'దే రికార్డ్. కానీ, 'బాహుబలి ది కంక్లూజన్' ఆ రికార్డ్‌ని దాటేసింది. కేవలం హిందీలో, ఇండియాలోనే 500 కోట్లు కొల్లగొట్టింది 'బాహుబలి'. దాన్ని దాటడం 'ట్యూబ్‌లైట్'కి కష్టమేకానీ అసాధ్యం అయితే కాకపోవచ్చు. ఓ తెలుగు సినిమా, హిందీలో రికార్డులు కొల్లగొట్టడాన్ని అభినందిస్తూ 'బాహుబలి ది కంక్లూజన్' ఘనత గురించి ఇంకా గొప్పగా చెప్పాడు.