ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన వెండి తెర, బుల్లి తెర నటులు మృతి చెందటం మనల్ని చాలా బాధిస్తున్నాయి. గడిచిన మూడు నెలలుగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన దాసరి, సినారె, రవితేజ తమ్ముడు భరత్, కొంతమంది బుల్లితెర నటులు చనిపోయిన విషయం మనకు తెలిసిందే.
తాజాగా కన్నడ టీవీ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటి, నటుడు మృతి చెందారు. 'మహానది, త్రివేణి సంగమ, మధుబాల' వంటి కన్నడ సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషించిన రచన(23), జీవన్(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పుణ్య క్షేత్రానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళితే కార్తీక్ అనే మరో టీవీ నటుడి బర్త్ డే వేడుకల నిమిత్తం, బెంగుళూరు సమీపంలో గల ప్రముఖ పుణ్య క్షేత్రానికి వెళ్లారు. అక్కడే దర్శనం చేసుకుని, పార్టీ కూడా చేసుకున్నారు. పార్టీ అయిన తరువాత తెల్లవారు జామున సఫారీ లో బెంగుళూరు తిరుగు ప్రయాణం చేస్తుండగా, మాగుడి తాలూకా సోలూరు సమీపంలోని జాతీయ రహదారి వద్దకు రాగానే, పక్కన ఆగి వున్న వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో రచన, జీవన్ అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.