విశ్వక్ సేన్ ఓ సినిమా చేశాడు. అదే... అశోక వనంలో అర్జున కల్యాణం. నిన్నా మొన్నటి వరకూ ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. అయితే ఒకే ఒక్క ఇంటర్వ్యూ వల్ల కోట్లాది రూపాయల ఫ్రీ పబ్లిసిటీ వచ్చి పడిపోయింది. అది టీవీ 9 పుణ్యం వల్ల.
విశ్వక్ తన పబ్లిసిటీలో భాగంగా.. ఓ ఫ్రాంక్ వీడియో చేశాడు. ఈ వీడియోని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ టీవీ 9 మాత్రం ఈ ఫ్రాంక్ వీడియో పేరుతో ఓ డిబేట్ నిర్వహించింది. అక్కడ విశ్వక్ సేన్, నాగవల్లి మధ్య జరిగిన రాద్ధాంతం తెలిసిందే. గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ నాగవల్లి ఫైర్ అవ్వడం, విశ్వక్ ఓ బూతు మాట అందుకోవడం.. వైరల్ అయ్యాయి. ఈ ఒక్క పోగ్రాంతో.. ఇప్పటి వరకూ ఎవరూ పట్టించుకోని, విశ్వక్ సేన్ సినిమాకి బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టైంది. ఇప్పుడు ఎవరి నోట విన్నా.. ఇదే మాట. విశ్వక్ చేసిన ఫ్రాంక్ వీడియోని ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. ఆ వీడియోతో డిబేట్ చేసిన టీవీ 9 పోగ్రాం మాత్రం పాపులర్ అయిపోయింది. నాగవల్లి.. విశ్వక్ కాంట్రవర్సీ లేకపోతే, ఈ సినిమాకి ఈ రేంజ్ లో పబ్లిసిటీ వచ్చేదే కాదు. ఈ విషయంలో విశ్వక్ సేన్ కూడా టీవీ 9కి థ్యాంక్స్ చెప్పుకుని ఉంటాడు.